24.2 C
Hyderabad
Monday, September 25, 2023

సచిన్, కొహ్లీలో ఎవరు గొప్ప: గిల్ ఏం చెప్పాడు?

న్యూజిలాండ్ తో ఇండోర్ లో జరిగిన మూడో వన్డేలో గిల్ మరో సెంచరీ సాధించడంతో అందరి కళ్లూ అతనిపైనే ఫోకస్ అయ్యాయి. మూడేళ్ల తర్వాత రోహిత్ శర్మ చేసిన సెంచరీ కన్నా, గిల్ వరుసగా చేస్తున్న సెంచరీలనే ఎక్కువ మంది ఆస్వాదిస్తున్నారు. రోహిత్ శర్మ మళ్లీ ఫామ్ లోకి రావడంతో అందరి కళ్లల్లో ఆనందం ఉంది గానీ, ఇప్పుడు గిల్ మాత్రం ఇండియన్ క్రికెట్ లో స్టార్ క్రికెటర్ అయిపోయాడనే చెప్పాలి.  

చాలాకాలం తర్వాత మళ్లీ ఆ స్టార్ క్రికెటర్ హోదా అందుకున్న వ్యక్తిగా కూడా గిల్ కొత్త రికార్డ్ సృష్టించాడనే చెప్పాలి. ఎందుకంటే గత మూడేళ్ల నుంచి…ఈ స్థాయిలో ఆడే ఆటగాడినే చూడలేకపోయారు క్రీడాభిమానులు.

ఇకపోతే గిల్…గత నాలుగు వన్డేల్లో ఒక డబుల్ సెంచరీ, రెండు సెంచరీలు చేసి విధ్వంసం సృష్టించాడు. ప్రస్తుతం గిల్ భీకర ఫామ్ లో ఉన్నాడని అందరూ అంటున్నారు. ఈ సందర్భంగా మ్యాచ్ అయిపోయిన తర్వాత సచిన్ టెండూల్కర్, విరాట్ కొహ్లీలో నీవు ఎవరిని ఎక్కువగా ఇష్టపడతావు, ఇద్దరిలో ఎవరు సూపర్ స్టార్ అని అడిగితే… ‘ఇది చాలా క్లిష్టమైన ప్రశ్న’ అని గిల్ చెబుతూనే తన మనసులోని మాట చెప్పాడు.

నన్ను అడిగితే నా సూపర్ స్టార్ కొహ్లీ అనే చెబుతానని అన్నాడు. ఎందుకంటే అందుకు నా దగ్గర సమాధానం కూడా ఉందని అన్నాడు. సచిన్ టెండూల్కర్ ని ‘క్రికెట్ ఆఫ్ గాడ్’ గా పరిగణిస్తానని, కొహ్లీని నా గురువుగా భావిస్తానని అన్నాడు.

నిజానికి సచిన్ సార్, క్రికెట్ ఆడుతున్న రోజుల్లో నాకు పెద్దగా ఆట గురించి తెలీదు. సచిన్ సార్ అంటే మా నాన్నగారికి చాలా ఇష్టం. ఆయన దగ్గర నుంచే ఆ పేరు తెలుసుకున్నాను. అప్పటి నుంచి ఆరాధించడం మొదలుపెట్టాను.

ఇక సచిన్ సార్ క్రికెట్ కి వీడ్కోలు పలికే సమయానికి ఇంకా నేను క్రికెట్ నేర్చుకునే దశలోనే ఉన్నాను. నాకు తెలిసే సమయానికి, నా హీరో కొహ్లీ మాత్రమే అన్నాడు. ఆయన ఆటని చూసే ఇన్ స్పైర్ అయ్యానని తెలిపాడు. అలాగే ఆడాలి, అలాగే పేరు తెచ్చుకోవాలని అనుకునేవాడినని అన్నాడు.

ఇక టీమ్ ఇండియాకి ప్రాతినిధ్యం వహిస్తున్న సమయంలో కొహ్లీ నా ఆరాధ్య క్రికెటర్ గా భావిస్తున్నాను, కొహ్లీ భయ్యాతో కలిసి క్రికెట్ ఆడటం, నేను ఊహించలేదని అన్నాడు. ఇది ఒక గౌరవంగా భావిస్తున్నానని అన్నాడు. ఒక బ్యాటర్ గా కొహ్లీ సార్ నుంచి ఎన్నో విలువైన సలహాలు తీసుకుని, నా ఆటలో లోపాలను సరిచేసుకున్నానని అన్నాడు.

చివరి నాలుగు మ్యాచ్ లో మూడు సెంచరీలు చేసిన గిల్, న్యూజిలాండ్ సిరీస్ లో ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు కూడా దక్కించుకున్నాడు. అంతేకాదు రికార్డుల మీద రికార్డులు కొల్లగొట్టాడు.

టీమ్ ఇండియాలో అతి తక్కువ వన్డేల్లో నాలుగు సెంచరీలు చేసిన ఆటగాడిగా రికార్డులకెక్కాడు. గతంలో ఈ రికార్డు శిఖర్ ధావన్ పేరు మీద ఉండేది. ధావన్ 24 మ్యాచ్ ల్లో ఈ ఫీట్ సాధిస్తే, గిల్ 21 మ్యాచ్ ల్లోనే లాగించాడు. క్రికెట్ మొత్తమ్మీద అతి తక్కువ ఇన్నింగ్స్ లో నాలుగు సెంచరీలు చేసిన జాబితాలో నాలుగో స్థానంలో ఉన్నాడు. ఇమామ్ ఉల్ హక్ (9) మొదటి స్థానంలో ఉండగా, క్వింటన్ డికాక్ (16) రెండో స్థానంలో ఉన్నాడు. డెన్నీస్ అమిస్ (18) మూడో స్థానంలో ఉన్నాడు. ఇప్పుడు గిల్ నాలుగో స్థానం అయితే,  హెట్మేయర్ (22) ఐదో స్థానంలో ఉన్నాడు.

దీంతో పాటు మరో ప్రపంచ రికార్డ్ ను గిల్ సమం చేశాడు. మూడు వన్డేల సిరీస్ లో అత్యధిక పరుగులు (360) చేసిన ఆటగాడిగా పాక్ ఆటగాడు బాబర్ అజాం సరసన నిలిచాడు.

ఆటతోపాటు రికార్డులు వస్తుంటే డబుల్ ఖుష్ గా ఉంటుందని గిల్ వ్యాక్యానించాడు.

Latest Articles

న్యూజిలాండ్‌లో ‘కన్నప్ప’ ప్రయాణం ప్రారంభం

మంచు విష్ణు డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ భక్త కన్నప్ప అడ్వెంచరస్ జర్నీ నేడు న్యూజిలాండ్‌లో ప్రారంభం అయింది. అవా ఎంటర్‌టైన్‌మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్‌లపై విష్ణు మంచు ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, మహాభారత్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

1,850FansLike
641FollowersFollow
289FollowersFollow
19,752SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్