- భద్రతా వలయంలో ఢిల్లీ నగరం
- రిపబ్లిక్ డే సందర్భంగా భద్రత పెంచిన పోలీసులు
- రద్దీగా ఉండే ప్రాంతాల్లో ముమ్మరంగా తనిఖీలు
ఢిల్లీ నగరంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. రిపబ్లిక్ డే సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రతను పెంచారు. ఇందులో భాగంగా ఆరు వేల మంది భద్రతా సిబ్బందిని నియమించారు. అలాగే 1500 సీసీటీవీలను ఏర్పాటు చేశారు. పాస్ పై వచ్చిన క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేసిన తరువాతే వేడుకలకు అనుమతిస్తామని పోలీసులు చెప్పారు. సమస్యాత్మక ప్రాంతాలు, హోటళ్లు, బస్ టెర్మినళ్లు, మెట్రో స్టేషన్లలో ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. ఈసారి రిపబ్లిక్ డే ఉత్సవాల్లో దాదాపు 65 వేల మంది వరకు పాల్గొనే అవకాశాలున్నట్లు ఒక అంచనా.