- విజయపథంలో పురోగమించాలని ఆకాంక్షించిన బీజేపీ చీఫ్
- సమాజంలో మార్పును ఆకాంక్షిస్తున్న యాజమాన్యానికి కితాబు

హైదరాబాద్ లోని స్వతంత్ర టీవీ ప్రధాన కార్యాలయాన్ని భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు, పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ సందర్శించారు. ఛానెల్ మేనేజింగ్ డైరక్టర్ బి కృష్ణ ప్రసాద్ ఆయనకు పుష్ప గుచ్ఛంతో స్వాగతం పలికారు. న్యూస్ ఛానల్ లోని వివిధ విభాగాల పనితీరుని ఆయన చూపించారు. అత్యాధునిక టెక్నాలజీ, నాణ్యమైన విధానాలు అవలంబిస్తున్న తీరుని కృష్ణ ప్రసాద్ వివరించారు. ఛానెల్ పనితీరుని, ఎంచుకొన్న లక్ష్యాలు, ప్రగతిని వివరించారు. ఈ సందర్భంగా ఎండీ కృష్ణ ప్రసాద్ తో బండి సంజయ్ ఆత్మీయంగా సమావేశం అయ్యారు. అనంతరం ఎండీ కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ… ఛానెల్ ను బండి సంజయ్ సందర్శించటాన్ని స్వాగతించారు.

అనంతరం బండి సంజయ్ మాట్లాడుతూ.. స్వతంత్ర టీవీ భవిష్యత్ లో విజయపథంలో పురోగమించాలని ఆకాంక్షించారు. ఛానల్ టీమ్ లో కసి ఉందని, నిజాయితీగా, నికచ్చిగా పనిచేసే వారికి స్వతంత్ర గొంతునందిస్తోందని అన్నారు. సమాజంలో మార్పును కాంక్షిస్తూ పనిచేయడం హర్షించదగ్గ విషయమన్నారు. ఇలాంటి ఛానల్స్ అవసరం సమాజానికి ఎంతో ఉందన్నారు