విషాదంగా ముగిసిన ఎస్ఎల్ బీసీ టన్నెల్ ప్రమాదం .. 3 మీటర్ల లోతులో మృతదేహాలు

విషాదంగా ముగిసిన ఎస్ఎల్ బీసీ టన్నెల్ ప్రమాదం.. 8 మంది మృతి

నాగర్‌కర్నూల్ జిల్లాలోని శ్రీశైలం ఎడమ గట్టు కాలువ (ఎస్‌ఎల్‌బిసి) సొరంగంలో పైకప్పు కూలిన ఘటన విషాదంగా ముగిసింది. ఏడు రోజులుగా చేపట్టిన సహాయక చర్యలు విఫలమయ్యాయిని తెలుస్తోంది. టన్నెల్ లోపల చిక్కుకున్న 8 మంది మృతి చెందినట్టు తెలుస్తోంది.

దాపు 3 మీటర్ల లోతులో మృతదేహాలను రెస్క్యూ టీం గుర్తించింది. ఫిబ్రవరి 22న ఎస్ ఎల్ బీసీ టన్నెల్ పనులు జరుగుతుండగా పైకప్పు కూలింది. అప్పటి నుంచి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

నేషనల్, ఇంటర్నేషనల్ ఏజెన్సీలు గత ఏడు రోజులుగా సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. టన్నెల్ బోరింగ్ మెషీన్ ను కట్ చేసేందుకు గ్యాస్ కట్టర్ వంటి విస్తృత ప్రయత్నాలు చేసినా రెస్క్యూ ఆపరేషన్ విషాదంగా ముగిసింది.

అధునాతన పరికరాలు, రాడార్‌లతో మృతదేహాలను గుర్తించినట్లు సహాయ చర్యల్లో అధికారులు తెలిపారు. మృతుల్లో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజనీర్లు ఉన్నారు. గ్రౌండ్ పెనట్రేటింగ్ రాడార్ మెషీన్ ద్వారా ప్రస్తుతం మూడు మృతదేహాలు బయటకు తీశారు. మట్టిలో కూరుకుపోయిన మిగతా 5 మృతదేహాలు గుర్తించగా.. వీటిని వెలికి తీయడానికి మరింత సమయం పడుతుంది. నేషనల్ జియోగ్రాఫిక్ రీసర్చ్ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో గాలింపు చర్యలు జరుగుతున్నాయి. ఈ సంఘటన భారీ స్థాయి మౌలిక ప్రాజెక్టుల్లో పనిచేసే కార్మికుల భద్రతపై ప్రశ్నలు లేవనెత్తుతోంది.

Latest Articles

అనిల్ రావిపూడి.. ప్రయోగం చేయబోతున్నారా..?

హిట్ మిషన్ అనగానే ఠక్కున గుర్తొచ్చేది అనిల్ రావిపూడి. కెరీర్ స్టార్ట్ చేసినప్పటి నుంచి వరుసగా బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధిస్తున్న ఈ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ ప్రస్తుతం వెంకీ, కళ్యాణ్ రామ్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్