నా బ్యాగులు మోయొద్దు.. మీ ఆత్మగౌరవాన్ని తగ్గించుకోవద్దు- మీనాక్షి నటరాజన్

నా బ్యాగులు మోయొద్దు.. మీ ఆత్మగౌరవాన్ని తగ్గించుకోవద్దు

ఫ్లెక్సీ, ఫోటోలు పెడితే నాయకులు ఎన్నికల్లో గెలవరని ఏఐసీసీ తెలంగాణ వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ అన్నారు. నాయకులు ప్రజల్లో ఉంటేనే గెలుస్తారని నేతలకు చురకలు అంటించారు. TPCC విస్తృత స్థాయి సమావేశంలో మాట్లాడిన మీనాక్షి నటరాజన్.. ఎలాంటి ప్రచారాలు లేకున్నా స్వతంత్ర పోరాటంలో గెలిచామని చెప్పారు. తన కోసం రైల్వే స్టేషన్లకు లీడర్స్ రావొద్దని .. బ్యాగ్లు ఎవరు మొయొద్దు.. బలం లేకపోతే నేనే మీ సహాయం అడుగుతానని అన్నారు. మీ ఆత్మ గౌరవాన్ని ఎక్కడా తక్కువ చేసుకోవద్దు.. మీరు మీ పని చేసుకోండని మీనాక్షి కాంగ్రెస్ నేతలకు హితబోధ చేశారు.

ఇంకా ఆమె మాట్లాడుతూ.. “ఇప్పుడు మనం ప్రభుత్వం లో ఉన్నాం.. పేద వాడి కోసం పని చేయాలి. పేదల మొఖంలో నవ్వులు చూడాలి.. అప్పుడే మనం పని చేసినట్టు. కాంగ్రెస్ కార్యకర్తలకు ఎంతో పోరాట శక్తి ఉంది.. అనేక రకాలుగా పోరాటాలు చేసాము.. అందుకే తెలంగాణ లో అధికారంలోకి వచ్చాము. రాహుల్ గాంధీ రాజ్యాంగ రక్షణ కోసం భారత్ జొడో యాత్ర నిర్వహించి ఒక మైదానాన్ని తయారు చేశారు. మనం దాని కోసం పోరాటం చేయాలి.

బీజేపీ, బిఆర్ఎస్ పార్టీలతో మనం ఇక్కడ పోరాటం చేయాల్సి ఉంది. కాంగ్రెస్ పార్టీ దేశం కోసం పోరాటం చేసి స్వాతంత్రాన్ని తెచ్చింది… కాంగ్రెస్ ఎలాంటి పోరాటానికి అయినా సిద్ధంగా ఉన్నాం. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనేక కార్యక్రమాలు చేపట్టింది. ఇవన్నీ ప్రజలకు సక్రమంగా అందాలి. పదేళ్లు గా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎంతో కష్టపడి పని చేసారు. వారికి న్యాయం జరగాలి.. పదవులు పొందిన వారు ప్రజల కోసం పని చేయాలి.

మనం చేసిన పనులను ప్రజలకు వివరించాలి. దేశంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ కులగణన చేపట్టాము.. ఇది చాలా గొప్ప విషయం. ప్రతి గ్రామ గ్రామానికి వెళ్లి జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపట్టాలి.
గ్రామ గ్రామాన పార్టీ కార్యక్రమాలను విస్తృతంగా చేపట్టాలి. ఈ విషయంలో పీసీసీ ఒక పకడ్బందీగా కాలెండర్ సిద్ధం చేయాలి. కార్యకర్తలు ఫోన్ చేస్తే మాట్లాడుతా”.. అని మీనాక్షి నటరాజన్ చెప్పారు.

Latest Articles

తెరుచుకున్న తుంగభద్ర గేట్లు… ముగ్గురు ముఖ్యమంత్రుల పూజలు

కర్ణాటక: తుంగభద్ర డ్యామ్‌ 33 కొత్త క్రస్ట్‌ గేట్లు తెరుచుకున్నాయి. గేట్లను ముగ్గురు సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డి, డీకే శివకుమార్‌ ప్రారంభించారు. 17వ గేటును కేంద్రమంత్రి సీఆర్‌పాటిల్ ప్రారంభించారు. 18వ గేటును...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
425,369SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్