కాంగ్రెస్ ప్రజాప్రభుత్వంలో సెప్టెంబర్ 17ను తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంగా జరుపుకున్నామని మంత్రి సీతక్క అన్నారు. హామీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలలో రెండింటిని అధికారంలోకి వచ్చిన 48 గంటల్లోనే అమలు ప్రారంభించి చరిత్ర సృష్టించామన్నారు. ఆడబిడ్డలకు తొలి ప్రాధాన్యత ఇచ్చి రాష్ట్రంలో ఏ మూలకైనా పైసా ఖర్చు లేకుండా ఆర్టీసీ బస్సుల్లో వెళ్లేందుకు అవకాశం కల్పించినట్లు ములుగులో మంత్రి సీతక్క తెలిపారు. రుణమాఫీతో తెలంగాణ రైతులు స్వేచ్ఛా వాయువులు పీలుస్తున్నారన్నారు. సన్నరకం వరిధాన్యం సాగు ప్రోత్సాహానికి క్వింటాలుకు 500 రూపాయల బోనస్ చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.