గత బీఆర్ఎస్ ప్రభుత్వం, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఎంఐఎంకు భయపడే విమోచన దినోత్సవాన్ని జరపలేదని మండిపడ్డారు ఎంపీ రఘునందన్ రావు. సెప్టెంబర్ 17కు విమోచన దినోత్సవం అనే పేరు పెట్టేందుకు కూడా రేవంత్ రెడ్డి భయపడుతున్నారని ఎద్దేవాచేశారు. ఓట్ల కోసం తప్ప హరీష్ రావుకు తెలంగాణ ప్రజలపై ప్రేమ లేదని ఆయన ఆరోపించారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ తల్లి విగ్రహం ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే విమోచన దినోత్సవం అధికారికంగా నిర్వహిస్తామని ఎంపీ రఘునందన్ రావు స్పష్టం చేశారు.