హైదరాబాద్ మహానగరంలో ప్రతియేటా ప్రతిష్టాత్మకంగా జరిగే గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో ఈ సారి మరో ప్రత్యేకత సంతరించుకుంది. బుల్లితెర నటీనటులు నగరం నలు మూలలా ఉండే గణేష్ మండపాలను స్వయంగా సందర్శించి, గణేష్ పూజలో పాల్గొని అక్కడ నిర్వాహకులను, భక్తులను స్వయంగా కలిసి వారితో ముచ్చటించారు. జెమినీ టీవీలో ప్రసారం అయ్యే ‘అమ్మకు ప్రేమతో’ సీరియల్ నటీనటులు బాలనగర్‌లోని శివాజీ యువసేన గణేష్ మండపాన్ని సందర్శించారు. ఈ కార్యక్రమం జెమినీ టీవీ, సీపీ ఫౌండేషన్ సారథ్యంలో జరిగింది. అమ్మకు ప్రేమతో సీరియల్ జెమినీ టీవీలో ప్రతిరోజు మధ్యాహ్నం 12.౩౦ గంటలకు ….తిరిగి రాత్రి 9 ౩౦ గంటలకు ప్రసారం అవుతోంది.