ప్రధాని మోదీ అడుగు జాడల్లో దేశం అభివృద్ధి చెందుతుందని..కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. 10 సంవత్సరాల క్రితం దేశాన్ని స్వచ్ఛత వైపు తీసుకెళ్లాలని మహాత్మా గాంధీని ఆదర్శంగా తీసుకొని..స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని ప్రారంభించారన్నారు. దేశమంతా పరిశుభ్రంగా ఉండాలనే ఉద్దేశంతో 14 రోజుల పాటు స్వచ్ఛత కార్యక్రమాన్ని చేపట్టడడం జరుగుతుందన్నారు. దేశం అగ్రస్థానం సాధించాలని..అందుకు శ్రీకాకుళం నుంచే శ్రీకారం చుట్టాలని కేంద్రమంత్రి అన్నారు. అంతకుముందు ఆయన మున్సిపల్ కార్యాలయ ఆవరణలో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో పాల్గొన్నారు.