ప్రజాపాలన పేరుతో డైవర్షన్ గేమ్ ఆడుతున్నారని సీఎం రేవంత్‌రెడ్డిపై మండిపడ్డారు మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ నేత కేటీఆర్. పాలనను పక్కన పెట్టి కేసీఆర్‌ను, బీఆర్‌ఎస్‌ను తిట్టడమే పనిగా పెట్టుకున్నారని ఫైర్ అయ్యారు. ఇకనైనా పాలనపై దృష్టి సారించాలన్నారు కేటీఆర్. తెలంగాణ తల్లి కొలువుదీరాల్సిన స్థలంలో రాజీవ్‌గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తూ.. తెలంగాణను అవమానించారని రేవంత్‌పై ధ్వజమెత్తారు కేటీఆర్. అంత ప్రేముంటే జూబ్లీహిల్స్‌లోని నీ నివాసంలో పెట్టుకోమంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాబోయే రోజుల్లో తప్పకుండా రాజీవ్‌గాంధీ విగ్రహాన్ని తొలగించి.. అదే స్థలంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామన్నారు.