ఢిల్లీ కొత్త సీఎంగా ఆప్ నేత, మంత్రి అతిశీ ఎన్నికయ్యారు. ఈ మేరకు శాసనసబా పక్ష నేతలు సమావేశమయ్యారు. కొత్త సీఎంగా అతిశీని ఎన్నుకొంటున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం కేబినెట్ మంత్రిగా ఉన్నారు అతిషి. అతిషి పేరును కేజ్రీవాల్ ప్రతిపాదించారు. కేజ్రీవాల్ ప్రతిపాదనకు శాసనసభా పక్షం ఆమోదం తెలిపింది. పార్టీ ఆవిర్బావం నుంచి అతిషీ క్రియాశీలకంగా ఉన్నారు. ఇవాళ సాయంత్రం సీఎం పదవికి రాజీనామా చేయనున్నారు కేజ్రీవాల్. లెఫ్టినెంట్ గవర్నర్‌ను కలిసి రాజీనామా లేఖ ఇస్తారు. ఇటీవల మద్యం కుభకోణం కేసులో తిహార్ జైలు నుంచి విడుదలయ్యారు.