ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలపై స్పందించారు నటి పూనమ్ కౌర్. జానీ మాస్టర్‌ని మాస్టర్ అని పిలవద్దంటూ ట్విట్టర్ పోస్ట్ చేశారు. ‘మాస్టర్’ అనే పదానికి కాస్త గౌరవం ఇవ్వండి అని తెలిపింది.
గత కొంతకాలంగా జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధిస్తున్నాడని ఆరోపిస్తూ మహిళా కొరియోగ్రాఫర్ పోలీసులకు పిర్యాదు చేసింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బాధితురాలి ఇంట్లోనే సుమారు 3 గంటలపాటు విచారించారు. అలాగే ఆమెకు వైద్య పరీక్షలు చేయించారు. షూటింగ్ టైమ్‌లో జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడని.. తన కోరిక తీర్చకపోతే ఆఫర్లు లేకుండా చేస్తానని బెదిరించాడని విచారణలో తెలిపింది.