నియంతృత్వ నిజాం నుంచి తెలంగాణకు విమోచన లభించిన రోజని అన్నారు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి. తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకల సందర్భంగా హైదారబాద్ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌లపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. రజాకార్ల వారసత్వమైన మజ్లిస్ పార్టీకి కొమ్ముకాస్తూ, అడుగులకు మడుగులోత్తుతూ తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారంటూ ఇరు పార్టీ నేతలపై మండిపడ్డారు.