35.7 C
Hyderabad
Wednesday, May 13, 2026
spot_img

మోదీ కేబినెట్ సంచలన నిర్ణయం.. మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం

స్వతంత్ర వెబ్ డెస్క్: దాదాపు రెండున్నర దశాబ్ధాలకు పైగా డిమాండ్‌లో ఉన్న మహిళా రిజర్వేషన్ బిల్లుకు నరేంద్రమోడీ కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. సోమవారం సాయంత్రం భేటీ అయిన కేంద్ర కేబినెట్ ఈ బిల్లుకు ఆమోదం తెలిపింది. ప్రధాని మోడీ అధ్యక్షతన గంటన్నరకు పైగా జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ బిల్లును మంగళవారం ఉదయం ప్రారంభమయ్యే పార్లమెంట్ ప్రత్యేక సమావేశంలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది.

కాగా, మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్ కల్పించాలని మూడు దశాబ్ధాల క్రితం నుంచే ఉద్యమం నడుస్తోంది. దీంతో మహిళా రిజర్వేషన్ బిల్లును 1996లో అప్పటి హెచ్‌డీ దేవెగౌడ సారధ్యంలోని యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం.. ఆ తర్వాత వచ్చిన వాజ్ పేయీ, మన్మోహన్ సింగ్ ప్రభుత్వం లోక్ సభలో ప్రవేశపెట్టినా ఆమోదముద్ర పడలేదు. రాజ్యసభలో 2010లో ఆమోదం పొందినా.. 2014లో లోక్ సభ రద్దు కావడంతో ఆ బిల్లు మురిగిపోయింది. తాజాగా నరేంద్రమోడీ నేతృత్వంలో కేబినెట్ ఆమోదం తెలపడంతో దేశ వ్యాప్తంగా మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Latest Articles

అమరావతితో పాటు విశాఖ, రాయలసీమ అభివృద్ధిపైనా దృష్టి- సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఒక్క అమరావతికే పరిమితం కాదని, విశాఖపట్నాన్ని కూడా విశ్వనగరంగా తీర్చిదిద్దుతున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు( N. Chandrababu Naidu) అన్నారు. రాజధాని ప్రాంతంలో కిమ్స్ ఆసుపత్రి వైద్య విశ్వవిద్యాలయం నిర్మాణానికి...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్