ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం రెవిన్యూ గెస్ట్ హౌస్ లో విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశాన్ని సీతక్క నిర్వహించింది. ఈ సమావేశంలో సీతక్క మాట్లాడుతూ.. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాల అధికారంలో ఉండి. 56 వేల కోట్ల రూపాయల అప్పు చేసింది. ఆ అప్పులు కట్టడానికి సరిపోతుంది. అయినా కూడా మేము అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నాము. రెండు లక్షల రుణమాఫీ చేశాము 56 వేల ఉద్యోగాలు ఇచ్చాము అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. రుణమాఫీ కాని వారికి పూర్తిగా రుణమాఫీ చేస్తాము పింఛన్లు కూడా పెంచుతాము రైతుబంధు రైతు బీమా అన్ని మా ప్రభుత్వం అమలు చేస్తుందని సీతక్క భరోసా ఇచ్చారు
బీఆర్ఎస్ పార్టీ నాయకులు. ప్రభుత్వం చేసే మంచి పనులు చూసి జీర్ణించుకోలేక యూట్యూబ్లో పెట్టి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని బీఆర్ఎస్ నాయకులపై నిప్పులు జరిగారు . టిఆర్ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాలు అధికారంలో ఉండి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో చెప్పాలని అన్నారు. దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని మాట తప్పిన ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం. అని ఎద్దేవా చేశారు. పేదవాడికి మూడెకరాల భూమి ఇస్తానని ఎక్కడ ఇచ్చారు? చెప్పాలని ఆమె అన్నారు. ఇండ్లు ఇస్తానని ఎక్కడ ఇల్లు ఇచ్చారు. నిరూపించాలని ఆమె అన్నారు. నాడు కుల సర్వే చేసి ఏమి చేశారని ఆమె అన్నారు. ఈనాడు మేము కుల సర్వ చేసేది ఏ కులo ఎంతుంది దాని ప్రకారం ఏ రిజర్వేషన్ అమలు చేయాలి . దానికోసమే ప్రభుత్వం చేపట్టిందని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ మండలాల నుండి మండల పార్టీ అధ్యక్షులు కార్యకర్తలు హాజరయ్యారు తాడ్వాయి ఎస్సై శ్రీకాంత్ రెడ్డి పస్త్రా సీఐ రవీందర్ బందోబస్తు నిర్వహించారు.