హైదరాబాద్ కేరాఫ్ అడ్రస్‌గా గుర్తుండిపోయే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ బిల్డింగులు నేలమట్టం అవుతున్నాయి. తెలుగు, హిందీ, ఇంగ్లీషు భాషల్లో సికింద్రాబాద్ అని కనిపించే మూడు ప్రధాన బిల్డింగులు ఇక మీద కనుమరుగు కాబోతున్నాయి. ఎన్నో తెలుగు సినిమాలలో కనిపించిన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ తన కంటూ ఒక ప్రత్యేకతను చాటుకుంది. అమృత్ భారత్ స్టేషన్ స్కీంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ను అత్యాధునిక సదుపాయాలతో అభివృద్ధి చేస్తోంది. అభివృద్ధిలో భాగంగా పాత బిల్డింగులను నిర్మాణ సంస్థ కూలగొడుతోంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పాత బిల్డింగుల కూల్చివేతల గురించి మా ప్రతినిధి విశాల్ మరిన్ని వివరాలు అందిస్తారు.