విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రవేటీకరణ చేసే ఆలోచన కేంద్రానికి లేదని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కొన్ని కారణాల వల్ల నష్టాల్లో ఉందని చెప్పారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రవేటీకరణపై ఏపీ ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయన్నారు. ఏపీ ప్రజల మనోభావాలను దృష్టిలో పెట్టుకుని విశాఖ స్టీల్ ప్లాంట్‌కి 11వేల 400 కోట్లు ఆర్థిక ప్యాకేజీ కేంద్రం ఇచ్చినట్టు తెలిపారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ కృషితో విశాఖ స్టీల్ ప్లాంట్‌కి ప్రత్యేక ప్యాకేజీ వచ్చిందని అన్నారు. భవిష్యత్‌లో విశాఖ స్టీల్ ప్లాంట్ అభివృద్దికి కేంద్రం సహకరిస్తుందని.. స్టీల్ ప్లాంట్‌ని నష్టాల్లో నుండి లాభాల్లోకి తీసుకురావాలని ప్రయత్నిస్తున్నామని కేంద్రమంత్రి చెప్పారు.