ఆంధ్రప్రదేశ్ సమగ్ర అభివృద్ధి కోసం లక్షా 20 వేల కోట్ల రూపాయలతో సాగరమాల ప్రాజెక్టులను చేపట్టారు. సాగరమాల కింద దాదాపు 113 ప్రాజెక్టులు చేపట్టి అమలు చేస్తున్నారు. సాగర్ మాల ప్రోగ్రాం కింద రాష్ట్రంలో విస్తరించి ఉన్న 975 కిలోమీటర్ల సముద్రతీరం వెంబడి.. పలు ప్రాజెక్టులు అమలులోకి వస్తాయి. తీరం వెంబడి ఉన్న అన్ని పోర్ట్‌లు, టెర్మినల్స్, రోల్ ఆన్, రోల్ ఆఫ్, టూరిజం కేంద్రాల ఆధునీకరణ, మౌలిక వసతుల కల్పన, పోర్ట్ ల కనెక్టివిటీ పెంపు, విస్తరణ. రాష్ట్రంలో నదీ జల మార్గాల అభివృద్ధి, విస్తరణ, స్కిల్ డెవలప్ మెంట్ టెక్నాలజీ సెంటర్ల ఏర్పాటు వంటి ఎన్నో ప్రాజెక్టులు అమలవుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్ లో లక్షకోట్ల విలువైన 119 ప్రాజెక్టులను గుర్తించారు. ఆ ప్రాజెక్టులన్నీ చురుగ్గా అమలవుతున్నాయి. రాష్ట్రంలో ఇప్పటికే 32 వేల కోట్ల రూపాయల ఖర్చుతో 36 ప్రాజెక్టులు పూర్తయ్యాయి. మరో 77 ప్రాజెక్టులు వివిధ స్థాయిల్లో అభివృద్ధి దశలో ఉన్నాయి. వీటిని 91 వేల కోట్ల రూపాయల ఖర్చుతో పూర్తి చేసేందుకు చురుగ్గా పనులు సాగుతున్నాయి. కేంద్రమంత్రిత్వశాఖలు భారతీయ రైల్వే, నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా. రాష్ట్ర ప్రభుత్వం, ప్రధాన రేవులు ఈ ప్రాజెక్టులను అమలు చేస్తున్నాయి. 13 రైలు మార్గాలను, 20 రోడ్డు మార్గాలనూ విస్తరించడం ద్వారా కనెక్టివిటీ పెంచే ప్రాజెక్టులు, రెండు కోస్టల్ ఎకనమిక్ జోన్ల ఏర్పాటు, విస్తరణ కు కృషి జరుగుతోంది.
ఇప్పటివరకూ పూర్తయిన 36 ప్రాజెక్టులలో పోర్ట్ ల ఆధునీకరణ, కనెక్టివిటీ పెంపు, పారిశ్రామిక వాడల ఏర్పాటు, పరిశ్రమల అభివృద్ధి, కోస్తా ప్రాంతంలో కమ్యునిటీ డెవలప్ మెంట్ , కోస్టల్ షిప్పింగ్, రాష్ట్రంలో జలమార్గాలలో రవాణా వంటి ఎన్నో ప్రాజెక్టులు ఉన్నాయి. ఈ 36 ప్రాజెక్టులకు ఇంతవరకూ 32,210 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. మరో 27 ప్రాజెక్టులు నిర్మాణ దశలో ఉన్నాయి. వీటికి 17,741 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. ప్రారంభ దశలోనూ మరిన్ని ప్రాజెక్టులు.. వీటికి 73,527 కోట్ల రూపాయలు ఖర్చు చేయాలని నిర్ణయించారు. ప్రధాన పోర్ట్ లలో బెర్త్ ల యాంత్రీకరణ, నాన్- మేజర్ పోర్ట్ లలో డ్రెడ్జింగ్ పనులకోసం ప్రాజెక్టులు అమలవుతున్నాయి.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటి కప్పుడూ ప్రాజెక్టు పురోగతిని తరచు సమీక్షిస్తూ.. అవసరమైన సలహాలు సూచనలు చేస్తున్నాయి. ఇంతే కాక, కేంద్ర షిప్పిగ్, జలమార్గాల మంత్రిత్వశాఖ విస్తృతంగా కోస్తా తీరం ఉన్న రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ను రాష్ట్ర స్థాయి సాగర మాల కమిటీలతోనూ, మారిటైమ్ స్టేట్ డెవలప్ మెంట్ కౌన్సిల్ తోనూ తరచు సంప్రదిస్తూ శీఘ్రగతిన ప్రాజెక్టుల అభివృద్ధికి కృషి చేయాల్సిందిగా సలహాలు, సూచనలు ఇస్తోంది. ఈ ప్రాజెక్టులన్నీ పూర్తయితే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలో దూసుకెళ్తుంది.