కూటమి నేతల తప్పుడు ప్రచారం వల్లే వైసీపీ ఎన్నికల్లో ఓడిపోయిందని మాజీమంత్రి రోజా అన్నారు. వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా వైసీపీ తిరిగి అధికారంలోకి వస్తుందని రోజా ధీమా వ్యక్తం చేశారు. సంపద సృష్టిస్తా అన్న చంద్రబాబు నేడు అప్పులపై అప్పులు చేస్తున్నారని రోజా విమర్శించారు. ఎన్నికల ముందు చంద్రబాబు ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపారన్నారు. కూటమి అధికారంలోకి రావడంతోటే ప్రజా సంక్షేమాన్ని మరచి, వైసీపీ నేతలపై కక్ష సాధింపు చర్యలకు దిగుతుందని రోజా విమర్శించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలపై దాడులు పెరిగాయని లెక్కలు చెబుతున్నాయని ఆమె చెప్పుకొచ్చారు.