సీఎం రేవంత్‌రెడ్డి సారథ్యంలో తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం సింగపూర్ పర్యటన కొనసాగుతోంది. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పలు కంపెనీలు ముందుకొస్తున్నాయి. ఇప్పటికే తెలంగాణలో రూ.3,500 కోట్ల పెట్టుబడులకు ఎస్‌టీ టెలీమీడియా గ్లోబల్ డేటా సెంటర్ ముందుకు వచ్చింది. రంగారెడ్డి జిల్లా ముచ్చర్ల సమీపంలోని మీర్‌ఖాన్‌పేటలో అత్యాధునిక ఏఐ ఆధారిత డేటా సెంటర్ క్యాంపస్‌ను స్థాపించేందుకు ఈ కంపెనీ రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం (ఎంవోయూ) చేసుకుంది.
తాజాగా క్యాపిటల్ ల్యాండ్ ప్రతినిధులతో భేటీ అయ్యింది. హైదరాబాద్‌లో రూ.450 కోట్ల పెట్టుబడికి ఆ సంస్థ ముందుకొచ్చింది. నగరంలో లక్ష చదరపు అడుగుల మేర ఐటీ పార్కు నిర్మించనుంది. ఈ మేరకు ఆ సంస్థ ప్రతినిధులతో సీఎం బృందం ఎంవోయూ కుదుర్చుకుంది.
క్యాపిటల్‌ల్యాండ్ గ్రూప్ పెట్టుబడి నిర్ణయాన్ని స్వాగతించారని సీఎం రేవంత్ అన్నారు.. వ్యాపార, సాంకేతిక హబ్‌గా హైదరాబాద్ స్థానాన్ని బలోపేతం చేయడంలో ఇది ఒక మైలురాయిగా నిలుస్తుందన్నారు. క్యాపిటల్ గ్రూప్ విభిన్నమైన పోర్ట్‌ఫోలియో రిటైల్, ఆఫీస్, లాడ్జింగ్, లాజిస్టిక్స్, డేటా సెంటర్‌లను విస్తరించిందన్నారు. దీంతో పాటు ఇంటర్నేషనల్ టెక్ పార్క్ హైదరాబాద్ లో రెండవ దశ పునరాభివృద్ధి ఈ ఏడాది స్టార్ట్ అయి.. 2028 నాటికి పూర్తి కానుందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.