హైదరాబాద్ నగరంపై సీఎం రేవంత్ రెడ్డి దృష్టి సారించాల్సిన అవసరం ఉందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. విద్యార్థుల ఫీజు రియంబర్స్‌మెంట్, ఆరోగ్యశ్రీ, ఆయుష్మాన్ భారత్‌ను ఏ ఆస్పత్రిలో చేసే పరిస్థితిలో లేకుండా పోయిందని ఎద్దేవా చేశారు. GHMCలో చిన్న చిన్న టెండర్లు వేసే వారికి కూడా నిధులను కేటాయించకపోవడం శోచనీయమన్నారు. హైదరాబాద్ నుండి GHMCకి 80 శాతం పన్నులు వెళుతున్నా రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, ఫ్లై ఓవర్ పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అభివృద్ధి పేరిట కోట్ల రూపాయల ప్రజా ధనాన్ని దోచుకుందని గుర్తు చేశారు. ఇప్పటికైనా సీఎం నిధులను సమకూర్చి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని కిషన్ రెడ్డి హితవు పలికారు.
హైదరాబాద్ నగరంపై రేవంత్ రెడ్డి దృష్టి సారించాల్సిన అవసరం ఉంది – కిషన్ రెడ్డి
0
277
Next article
Latest Articles
టీడీపీలో దిద్దుబాటు చర్యలు?
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి భవిష్యత్ ప్రయాణంపై సరికొత్త విశ్లేషణలు తెరపైకి వస్తున్నాయి. కేవలం సంక్షేమం, అభివృద్ధిని నమ్ముకుని అంతా సవ్యంగానే ఉందనుకుంటే మొదటికే మోసం వస్తుందన్న హెచ్చరికలు తెలుగుదేశం పార్టీ నాయకత్వానికి...
- Advertisement -
- Advertisement -


