హమాస్ చేసిన దారుణం ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. స్వలింగ సంపర్కులైన సొంత సభ్యులను హమాస్ హింసించి ఉరితీసినట్టు బయటకు వచ్చింది. పాలస్తీనా గ్రూప్‌కు చెందిన రహస్య పత్రాల ద్వారా ఈ విషయం వెల్లడైంది. నివేదిక ప్రకారం.. హమాస్ గ్రూప్‌కి చెందిన చాలా మంది సభ్యులు.. పురుష ఇజ్రాయెలీ బాధితులపై అత్యాచారం చేశారు. 2023 అక్టోబర్ 7న హమాస్ అటాక్ చేసినప్పుడు కనీసం 1,200 మంది మరణించారు. ఈ దాడి తర్వాత హమాస్ బందీలుగా ఉన్న ఇజ్రాయెల్ పురుషులపై ఈ ఘోరం చేసినట్టు సమాచారం.
నివేదిక ప్రకారం.. హమాస్ నియమించుకున్న 94 మంది ఈ నేరాలకు పాల్పడినట్టు తెలుస్తోంది. వారిపై హోమోసెక్సువాలిటీకి సంబంధించిన సంభాషణలు, పరాయి మహిళలతో సన్నిహితంగా మెలగడం వంటి ఆరోపణలు వచ్చాయి. ఈ నివేదికలో చిన్నారులపై అత్యాచారాలు, హింసకు సంబంధించిన ఆరోపణలు కూడా ఉన్నాయి.
వారిపై వచ్చిన ఆరోపణలు ఇలా ఉన్నాయి.. “అతను (హమాస్ సభ్యులలో ఒకరు) నిరంతరం దేవుణ్ణి శపిస్తాడు”. మరొకరు, “అతను ఫేస్‌బుక్‌లో శృంగార సంబంధాలను కలిగి ఉన్నాడు” …
హమాస్‌కు ఆమోదయోగ్యం కాని పనులు చేసిన సొంత సభ్యులను ఏం చేశారనేది స్పష్టంగా తెలియదు. కానీ గాజాలో స్వలింగ సంపర్కం చట్టవిరుద్ధం..అటువంటి వారికి జైలు, మరణ శిక్ష విధిస్తారు.
మాజీ హమాస్ కమాండర్, మహమూద్ ఇష్తీవికి స్వలింగ సంపర్క సంబంధాలు ఉన్నాయని ఆరోపణలు వచ్చాయి. దీంతో అతనిని 2016 లో ఉరితీశారు. మాజీ కమాండర్‌ను అతని అవయవాల ద్వారా వేలాడదీసి హింసించిన దాదాపు సంవత్సరం తరువాత, అతని ఛాతీలోకి మూడు బుల్లెట్లతో కాల్చి చంపేశారు.