మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా మెహర్ రమేష్ తెరకెక్కిస్తున్న ‘భోళా శంకర్’ మూవీ ట్రైలర్ రిలీజ్ అయింది. చిరంజీవికి జోడీగా తమన్నా నటిస్తున్న ఈ చిత్రంలో.. మెగాస్టార్‌కు చెల్లిగా కీర్తి సురేష్ నటిస్తోంది.
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ లాంచ్ చేసిన ‘భోళా శంకర్’ ట్రైలర్ చూస్తే చిరంజీవి లుక్ యంగ్‌గా కనిపిస్తోంది. లుక్స్ పరంగా ఎంతగానో ఆకట్టుకుంటున్న మెగాస్టార్.. అదే రీతిలో కామెడీ కూడా పండించారు. గ్యాంగ్ స్టర్ బ్యాక్‌డ్రాప్‌లో స్టోరీ ఉన్నట్లు తెలుస్తోంది. ఆగస్టు 11న ‘భోళాశంకర్’ సినిమా విడుదల కానుంది. ఈ సినిమా మెగాభిమానులకు ఎలాంటి అనుభవాన్ని అందిస్తుందో చూడాలి.