28.2 C
Hyderabad
Sunday, December 3, 2023
spot_img

MEGA@45: చిరంజీవికి గ్లోబల్ స్టార్ అభినందనలు

మెగాస్టార్ చిరంజీవి.. తెలుగు సినీ అభిమానులకు పరిచయం అక్కర్లేని పేరు. సామాన్యుడిగా చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించి ఇంతింతై వటుడింతైనట్లు మెగాస్టార్‌గా ఎదిగారు. కొన్ని కోట్ల మందికి స్ఫూర్తినిస్తూ తన అలుపెరుగని ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. ఆయన చిత్ర సీమలోకి ప్రవేశించి 45 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ఆయన తనయుడు, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అభినందనలు తెలియజేశారు.

‘‘సినీ పరిశ్రమలో 45 సంవత్సరాల మెగా జర్నీని పూర్తి చేసుకున్న మన ప్రియమైన మెగాస్టార్‌కి హృదయపూర్వక అభినందనలు. ఆయన ప్రయాణం ఎంతో గొప్పది. ప్రాణం ఖరీదుతో ప్రారంభమైన ఈ జర్నీలో ఆయన మనల్ని ఇప్పటికీ అబ్బురపరుస్తూనే ఉన్నారు. వెండితెరపై అద్భుతమైన నటనతో, బయట మీ మానవత్వంతో కూడిన మీ కార్యకలాపాలను కొనసాగిస్తూ కొన్ని కోట్ల మందిని ఇన్‌స్పైర్ చేస్తూనే ఉన్నారు. క్రమశిక్షణ, కష్టించే తత్వం, అంకిత భావం వంటి విలువలతో పాటు వాటన్నింటినీ మించి మాలో కరుణను పెంపొందించిన నాన్నగారికి ధన్యవాదాలు’’ అని అన్నారు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్.

Latest Articles

రంగంలోకి డీకే.. అసలేం జరగబోతోంది?

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆదివారం వెలువడనుండడంతో కాంగ్రెస్ పార్టీ అప్రమత్తమైంది. ఎగ్జిట్ పోల్ సర్వేల ప్రకారం కాంగ్రెస్‌కు ఎక్కువ సీట్లు వస్తాయని అంచనాలు రావడం, అలాగే హంగ్ ఏర్పడే అవకాశం...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

1,850FansLike
641FollowersFollow
291FollowersFollow
19,752SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్