ప్రభుత్వ బంగ్లా ఖాళీ చేయాలని లోక్ సభ హౌసింగ్ కమిటీ పంపిన నోటీసులపై కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi)స్పందించారు. ఢిల్లీలోని 12, తుగ్లక్‌లేన్‌లోని తన బంగ్లాను ఖాళీ చేయాలని లోక్‌సభ సచివాలయం పంపిన లేఖ అందిందన్నారు. ప్రజల తీర్పుతో నాలుగు సార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికై తాను ఈ బంగ్లాలో ఉన్నానని తెలిపారు. ఈ బంగ్లాలో తనకు చాలా ఆనందకర జ్ఞాపకాలున్నాయన్నారు. తన బాధ్యతగా బంగ్లాను ఖాళీ చేస్తా అని రాహుల్ వెల్లడించారు. 12, తుగ్లక్ లేన్‌లోని బంగళాలో 2005 నుంచి రాహుల్ గాంధీ ఉంటున్నారు. కాగా పరువు నష్టం కేసులో రెండేళ్ల జైలు శిక్ష పడటంతో రాహుల్(Rahul Gandhi) లోక్‌సభ సభ్యత్వం(Disqualification) రద్దు అవ్వడంతో అధికార బంగ్లాను ఏప్రిల్ 22లోగా ఖాళీ చేయాలంటూ రాహుల్‌కు లోక్‌సభ హౌసింగ్ కమిటీ సోమవారం నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే.
Read Also: నిమ్స్ లో 200 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి భూమిపూజ..
Follow us on: Youtube, Instagram, Google News