Harish Rao |హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో 200 పడకల సూపర్ స్పెషాలిటీ ఎం సి హెచ్ ఆసుపత్రికి రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య మంత్రి హరీశ్ రావు, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం మాతా శిశు సంరక్షణకు ఎంతో ప్రాధాన్యతనిస్తోందన్నారు. ఎం సి హెచ్ ల మీద 490 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామన్నారు. తెలంగాణలో మాతా శిశు మరణాలు తగ్గి దేశం లోనే 3 వ స్థానంలో నిలిచామన్నారు. మొదటి స్థానంలో నిలిచేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు.
గర్భిణులు ఎన్నో ఆరోగ్య సమస్యలతో బాధపడుతుంటారని, వారందరికి మెరుగైన సేవలు అందించేందుకు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి చెంతకు ఎం సి హెచ్ తెస్తున్నామన్నారు. హైదరాబాద్ గాంధీ ఆసుపత్రితో పాటు అల్వాల్ లో , నిమ్స్ లో మొత్తం 600 పడకల ఎం సి హెచ్ ఆసుపత్రి ఏర్పాటు చేస్తున్నామని మంత్రి హరీష్ రావు(Harish Rao) పేర్కొన్నారు. మాతా శిశు మరణాలు తగ్గించేందుకు ఈ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో అధునాతన సౌకర్యాలు కల్పిస్తున్నామని తెలిపారు. పేద ప్రజలకు కార్పొరేట్ వైద్యం అందించేందుకు ఎర్రమంజిల్ స్థలం మొత్తం నిమ్స్ కి ఇవ్వాలని సీఎం నిర్ణయించారని తెలిపారు. వంద పడకల డయాలసిస్ సెంటర్ ప్రారంభించబోతున్నామన్నారు. ఇప్పటి వరకు డయాలసిస్ బెడ్స్ 34 ఉంటే నిమ్స్ లో 100 కు పెంచుకుంటున్నామని మంత్రి తెలిపారు.
Read Also: మహిళా రిజర్వేషన్ బిల్లుపై బీఆర్ఎస్ ఉద్యమం ఉదృతం..
Follow us on: Youtube, Instagram, Google News