ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడిగా ఉన్న టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు బెయిల్ పిటిషన్పై ఇవాళ నాంపల్లి కోర్టు విచారణ జరగనుంది. రాధాకిషన్ రావు బెయిల్ పిటిషన్పై పంజాగుట్ట పోలీసులు కౌంటర్ దాఖలు చేశారు. రాధాకిషన్ రావుకు బెయిల్ ఇవ్వొద్దంటూ కోరారు. ఈ నేపథ్యంలో కోర్టు నిర్ణయంపై సర్వత్ర ఉత్కంఠ నెలకొంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు బెయిల్ పిటిషన్ పై సోమవారం విచారణ జరిగింది. ఈ సందర్భంగా రాధాకిషన్ రావు బెయిల్ పిటిషన్ పై కౌంటర్ దాఖలు చేసిన పంజాగుట్ట పోలీసులు. రాధాకిషన్ రావుకు బెయిల్ ఇవ్వొద్దని కోరారు. కేసు దర్యాప్తు కీలక దశలో ఉన్న నేపథ్యంలో పోలీసులు బెయిల్ ఇవ్వొద్దని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. అనంతరం ఈ పిటిషన్ పై విచారణను కోర్టు నేటికి వాయిదా వేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏ4 నిందితుడిగా ఉన్న రాధాకిషన్ రావు.. ప్రస్తుతం చంచల్ గూడా జైలులో ఉన్నారు. అయితే అనారోగ్యంతో ఆసుపత్రిలో ఉన్న తల్లిని చూసేందుకు రాధాకిషన్ రావుకు ఈనెల 20న కోర్టు మంధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. దీంతో 21వ తేదీన జైలు పోలీస్ ఎస్కార్ట్ మధ్య కరీంనగర్ కు చేరుకుని ఆసుపత్రిలో ఉన్న తల్లిని చూసి వచ్చారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో రాధాకిషన్ రావు బెయిల్
0
169
Previous article
Next article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


