తెలంగాణ రాష్ట్రంలో నేడు పదో తరగతి ఫలితాల విడుదలకు సర్వం సిద్ధమైంది. అధి కారులు ముహూర్తం ఫిక్స్ చేశారు. మంగళ వారం ఉదయం 11 గంటలకు విద్యాశాఖ కమిష నర్ కార్యాలయం గోదావరి ఆడిటోరియంలో విద్యాశాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ బుర్ర వెంకటేశం ఈ ఫలితాలను ప్రకటించనున్నారు. విద్యార్థులు. వెబ్సైట్ నుంచి తమ ఫలితాలను చూడొచ్చని ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. http://results.bse.telangana.gov.in లేదా http://results .bsetelangana.org లింక్స్ ద్వారా రిజల్స్ తెలుసుకోవచ్చని వెల్లడించారు. హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేసి మార్కులను చెక్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. పదో తరగతి పరీక్షలు ఈ ఏడాది మార్చి 18 నుంచి ఈ నెల 2 వరకు కొనసాగాయి. రాష్ట్రవ్యాప్తంగా 5 లక్షలకు పైగా స్టూడెంట్స్ పరీక్ష లురాశారు. విద్యార్థుల సంఖ్యకనుగుణం గా మొత్తం 2,676 పరీక్షాకేంద్రాలను ఏర్పాటు చేశారు.
బషీర్‌బాగ్‌లోని ఎస్‌సీఈఆర్‌టీలో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం టెన్త్ విడుదల చేసిన ఫలితాల్లో 91.31 శాతం విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. పదో తరగతి పరీక్షా ఫలితాల్లో ఈసారి కూడా బాలికలదే పై చేయి సాధించారు. బాలికలు 93.23 ఉత్తీర్ణత సాధించగా బాలురు 89.42శాతం ఉత్తీర్ణత పొందారు. ఫలితాల్లో 99.05 శాతంతో నిర్మల్ జిల్లా మొదటి స్థానంలో 65.10 శాతంతో వికారాబాద్ చివరి స్థానంలో నిలిచాయి. 3 వేల 927 స్కూల్స్ లో వందశాతం ఉత్తీర్ణత నమోదైంది. ఫెయిల్ అయిన విద్యార్థులు సప్లిమెంటరీ పరీక్షలు రాసుకోవచ్చని బుర్ర వెంక టేశం అన్నారు. జూన్ 3 నుంచి జూన్ 13వ తేదీ వరకు అడ్వాన్స్ సప్లమెంటరీ పరీక్షలు జరుగుతాయని చెప్పారు.


