ఓ అమ్మాయి నిజ జీవిత కథతో వస్తున్న ‘ప్యారి – తారావలి ది ట్రూ స్టోరీ’

మధ్యప్రదేశ్‌లో ఓ అమ్మాయి జీవితంలో జరిగిన ఓ యధార్థ సంఘటన ఆధారంగా హిందీ – తెలుగు భాషల్లో రూపొందిన హార్ట్ టచింగ్ లవ్ స్టోరీ ‘ప్యారీ’. తారావాలి – ది ట్రూ స్టోరీ అనేది ట్యాగ్ లైన్. పలు సూపర్ హిట్ హిందీ ధారావాహికలు, వీడియో ఆల్బమ్స్‌తో సుప్రసిద్ధురాలయిన డాలి తోమర్ టైటిల్ పాత్ర పోషించిన ఈ చిత్రాన్ని ఓంషీల్ ప్రొడక్షన్స్ పతాకంపై కల్పన తోమర్-అమిత్ గుప్తా సంయుక్తంగా నిర్మించారు. రహమాన్ అలి – రాజారామ్ పాటిదార్ సహ నిర్మాతలు!!

పలు ప్రతిష్టాత్మక అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో పలు విభాగాల్లో అవార్డులు గెలుచుకున్న ఈ చిత్రం హిందీ – తెలుగు భాషల్లో అక్టోబర్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమాగా తెరకెక్కడానికి ముందే పుస్తక రూపంలో వెలువడి లక్షలాది పాఠకుల మనసులు దోచుకున్న “ప్యారీ” రచయిత రజనీష్ దూబే ఈ చిత్రానికి దర్శకత్వం వహించడంతోపాటు లక్ష్మణ్ పాత్రను పోషించడం విశేషం. అంతేకాదు… ఆర్.పి.సోనితో కలిసి ఈ చిత్రానికి సంగీత సారథ్యం వహించారు.

ఈ చిత్రం విడుదలను పురస్కరించుకుని హైదరాబాద్, ప్రసాద్ ల్యాబ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాజారామ్ పాటిదార్, జిగ్నేష్ షా, మనీషా సింగ్ ముఖ్య అతిధులుగా పాల్గొని “ప్యారీ” పెద్ద హిట్ కావాలని కోరుకున్నారు. చిత్ర కథానాయిక డాలి తోమర్, రచయిత – నటుడు – దర్శకుడు రజనీష్ దూబే, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ సయ్యద్ హుస్సేన్ మాట్లాడుతూ… స్వేచ్ఛను – స్వచ్ఛమైన ప్రేమను కోరుకునే ఓ మగువ మనసును ఎంతో హృద్యంగా ఆవిష్కరిస్తూ రూపొందిన “ప్యారీ” ఇప్పటివరకు భారతీయ తెరపై రూపొందిన అత్యుత్తమ ప్రేమ కథా చిత్రాల్లో ఒకటిగా నిలుస్తుందని తెలిపారు!.

Latest Articles

కాసేపట్లో తెరుచుకోనున్న తుంగభద్ర గేట్లు.. ఒకే వేదికపై ముగ్గురు సీఎంలు

కాసేపట్లో తుంగభద్ర డ్యామ్‌ గేట్లు తెరుచుకోనున్నాయి. ఒకే వేదికపై మూడు రాష్ట్రాల సీఎంలు మెరవనున్నారు. రేవంత్‌, చంద్రబాబు, డీకే శివకుమార్‌.. కేంద్రమంత్రి సీఆర్‌ పాటిల్‌తో కలిసి గేట్లు ప్రారంభించనున్నారు. 2024 ఆగస్టులో వరద...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
425,369SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్