ఏపీలో ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లకు పదోన్నతులు దక్కాయి. ఆంధ్రప్రదేశ్ కేడర్‌కు చెందిన ఐదుగురు ఎస్పీ స్థాయి అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం డీఐజీలుగా ప్రమోషన్లు దక్కాయి. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే మరో ఐదుగురు ఐఏఎస్ అధికారులకు కూడా ప్రమోషన్‌లు వచ్చాయి.
రెండు రోజుల క్రితం పలువురు ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లకు పదోన్నుతులు దక్కాయి. ఐదుగురు ఐఏఎస్ అధికారులకు, ఏడుగురు ఐపీఎస్ అధికారులకు పదోన్నతి దక్కింది. 2012 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారులు ప్రసన్న వెంకటేష్, విజయరామరాజు, నాగలక్ష్మి, మల్లికార్జున, ఎస్ మంజీర్ జిలానీలు అదనపు కార్యదర్శులుగా పదోన్నతి పొందారు. ప్రస్తుతం ఈ ఐఏఎస్‌లు జాయింట్ సెక్రటరీ కేడర్‌లో ఉన్నారు. వీరికి ప్రమోషన్లు దక్కినా… వీరంతా ఆ స్థానాల్లోనే కొనసాగనున్నారు.
ఐపీఎస్‌ల పదోన్నతుల విషయానికి వస్తే.. రవాణా శాఖ కమిషనర్ మనీష్‌కుమార్ సిన్హాకు ప్రమోషన్ దక్కింది. ఐజీ ర్యాంక్ అధికారిగా ఉన్న మనీష్‌కుమార్ అడిషనల్ డీజీగా పదోన్నతి లభించింది. అలాగే డీఐజీ ర్యాంక్ అధికారి రాజకుమారికి ఐజీగా ప్రమోషన్ వచ్చింది. 2011 బ్యాచ్‌కు చెందిన ఐదుగురు ఐపీఎస్‌లకు ఎస్పీ నుంచి డీఐజీలుగా పదోన్నతి దక్కింది. వీరిలో ఫకీరప్ప కాగినెల్లి, సత్యఏసుబాబు, అన్బురాజన్, వెంకటప్పలనాయుడు, బాబూజీ అట్టాడలకి డీఐజీ ప్రమోషన్ వచ్చింది. వీరిలో వెంకటప్పలనాయుడు కేంద్ర సర్వీసులో డిప్యుటేషన్‌పై ఉండగా.. ఫక్కీరప్ప ఎస్‌ఐబీలో ఎస్పీగా పనిచేస్తున్నారు. సత్య ఏసుబాబు, కేకేఎన్ అన్బురాజన్, అట్టాడ బాబూజీలు ప్రస్తుతం వెయిటింగ్‌లో ఉన్నారు.