కోర్టు బోను ఎక్కనున్న ప్రిన్స్ హ్యారీ

స్వతంత్ర వెబ్ డెస్క్: బ్రిటన్ రాజకుమారుడు ప్రిన్స్ హ్యారీ కోర్టు బోను ఎక్కనున్నారు. ఓ వార్తా సంస్థపై హ్యారీతోపాటు ఇతర ప్రముఖులు వేసిన కేసు విచారణలో భాగంగా ఆయన లండన్‌ హైకోర్టుకు హాజరై బోనులో నిలబడి సాక్ష్యం చెప్పనున్నారు. బ్రిటన్ రాజకుమారుడు కోర్టు బోను ఎక్కటంపై 130 ఏళ్ల చరిత్రలో తొలిసారి. దీంతో ప్రపంచం ఆసక్తిగా గమనిస్తోంది. ప్రిన్స్ హ్యారీ కోర్టు బోను ఎక్కి సాక్ష్యం చెప్పనున్నారు. దీంతో ప్రపంచం దృష్టి మరోసారి ప్రిన్స్ హ్యారీపై పడనుంది. 130 ఏళ్లలో కోర్టు రూమ్‌లో సాక్ష్యం చెప్పిన బ్రిటన్‌ తొలి రాజకుటుంబీకుడిగా ప్రిన్స్‌ హ్యారీ నిలవనున్నారు.

బ్రిటన్‌ రాజు ఛార్లెస్‌ III రెండో కుమారుడు ప్రిన్స్‌ హ్యారీ, భార్య మెర్కెల్‌ లు కొంతకాలంగా ప్రపంచ వ్యాప్తంగా వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. బ్రిటన్ రాజకుటుంబం నుంచి బయటకు వచ్చేసిన ప్రిన్స్ హ్యారీ వార్తల్లో నిలిచారు. ఇంటర్వ్యూల్లో రాజసౌథంలో తమకు ఎదురైన సంఘటనలు చెప్పటం పెను సంచలనంగా మారాయి. పలు అరుదైన సందర్భాల్లో తప్ప అంటే హ్యారీ నాయనమ్మ క్వీన్ ఎలిజబెత్ 2 మరణం, ఆ తరువాత తండ్రి కింగ్ చార్లెస్ పట్టాభిషేకం సమయాల్లో మాత్రమే ఆయన బ్రిటన్ రాజసౌధానాకి వచ్చారు. వచ్చిన కార్యక్రమాలు ముగించుకుని తిరిగి అమెరికా వెళ్లిపోయారు.

బ్రిటన్‌కు చెందిన మిర్రర్‌ గ్రూప్‌.. అనేక మంది ప్రముఖుల వ్యక్తిగత విషయాలను సేకరించేందుకుగానూ చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిందనే ఆరోపణలు వచ్చాయి. ఫోన్‌ హ్యాకింగ్‌ ఆరోపణలకు సంబంధించి ప్రిన్స్‌ హ్యారీతోపాటు వంద మందికిపైగా ప్రముఖులు ఆ సంస్థపై కోర్టులో దావా వేశారు. అంతకుముందు 1870లో ఓ విడాకుల కేసుకు సంబంధించి ఎడ్వర్డ్‌-7 కోర్టుకు హాజరై సాక్ష్యం చెప్పారు. మరో 20ఏళ్ల తర్వాత ఓ పరువునష్టం కేసు విచారణ సమయంలోనూ సాక్ష్యమిచ్చారు. ఈ రెండూ కూడా ఆయన రాజు కాకముందే జరిగాయి.గా రాజకుటుంబంలో వ్యక్తులు కోర్టుకొచ్చి సాక్ష్యం చెప్పిన ఘటన 1870లో జరిగింది. ఓ విడాకులు కేసుకు సంబంధించి ఎడ్వర్డ్‌ VII కోర్టుకు హాజరై సాక్ష్యం చెప్పారు. ఆ తరువాత మరో 20 ఏళ్లకు ఓ పరువునష్టం కేసు విచారణలో భాగంగాను సాక్ష్యం చెప్పారు. ఈ రెండు ఎడ్వర్డ్ ఆయన రాజు కాకముందే జరిగాయి. రాయల్ కుటుంబం నుంచి కోర్టుకొచ్చి సాక్ష్యం చెప్పటం అదే మొదటిసారి.

కాగా ప్రిన్స్ హ్యారీ తల్లి యాక్సిడెంట్ లో ప్రాణాలు కోల్పోయిన డయానా అనే విషయం తెలిసిందే.డయానాకు..ఇటీవలే బ్రిటన్ రాజుగా పట్టాభిషేకం అయిన కింగ్ చార్లెస్ లకు ఇద్దరు కుమారులు, పెద్ద కుమారుడు విలియం, చిన్నకుమారుడు హ్యారీ.

Latest Articles

ధనుష్‌.. ప్లాన్ అదిరింది..

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తమిళ్, తెలుగు చిత్రాలతో పాటు హిందీ సినిమాలకు సమాన ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇప్పుడు బాలీవుడ్లో మరో ప్రతిష్టాత్మకమైన సినిమా చేసేందుకు ఓకే చెప్పారని టాక్ వినిపిస్తోంది. ధనుష్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్