నేడు 18 రైలు రద్దు.. 7 రైలు దారి మళ్లింపు

స్వతంత్ర వెబ్ డెస్క్: ఒడిశాలో శుక్రవారం రాత్రి జరిగిన ఘోర రైలు ప్రమాదం నేపథ్యంలో దూర ప్రాంతాలకు వెళ్లే 18 రైళ్లను అధికారులు తాత్కాలికంగా రద్దు చేశారు. అలాగే టాటానగర్‌ స్టేషన్‌ మీదుగా మరో 7 రైళ్లను మళ్లించినట్లు వెల్లడించారు.

వీటిలో హావ్‌డా-పూరీ సూపర్‌ఫాస్ట్‌ (12837), హావ్‌డా-బెంగళూరు సూపర్‌ఫాస్ట్‌ (12863), హావ్‌డా-చెన్నై మెయిల్‌ (12839), హావ్‌డా-సికింద్రాబాద్‌(12703), హావ్‌డా-హైదరాబాద్‌(18045), హావ్‌డా-తిరుపతి(20889), హావ్‌డా-పూరీ సూపర్‌ఫాస్ట్‌ (12895), హావ్‌డా-సంబల్‌పుర్‌ ఎక్స్‌ప్రెస్‌ (20831), సంత్రగాచి-పూరీ ఎక్స్‌ప్రెస్‌ (02837) ఉన్నట్లు అధికారులు తెలిపారు.

బెంగళూరు-గువాహటి(12509) రైలును విజయనగరం, టిట్లాగఢ్‌, జార్సుగుడా, టాటా మీదుగా దారి మళ్లించారు. ఖరగ్‌పుర్‌ డివిజన్‌లో ఉన్న చెన్నై సెంట్రల్‌-హావ్‌డా(12840) రైలును జరోలి మీదుగా, వాస్కోడగామా-షాలిమార్‌(18048), సికింద్రాబాద్‌-షాలిమార్‌(22850) వారాంతపు రైళ్లను కటక్‌, అంగోల్‌ మీదుగా దారి మళ్లించినట్లు రైల్వే అధికారులు తెలిపారు.

ప్రధాని నరేంద్ర మోడీ వర్చ్యువల్ విధానంలో ప్రారంభించాల్సిన ముంబై- గోవా వందేభారత్ రైలు కార్యక్రమాన్ని వాయిదా వేసినాట్లు అధికారులు ప్రకటించారు. మడ్గావ్‌ స్టేషన్‌ నుంచి ప్రారంభించదలచిన గోవా-ముంబై వందేభారత్‌ రైలును.. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్‌ ప్రకారమైతే శనివారం ఉదయం వీడియో అనుసంధానం ద్వారా ప్రధాని మోదీ ఈ రైలుకు పచ్చజెండా ఊపి ప్రారంభించాల్సి ఉంది.

Latest Articles

కాసేపట్లో బాలాపూర్ లడ్డూ వేలం పాట

బాలాపూర్‌ గణనాథుడి నిమజ్జనానికి ఏర్పాట్లు పూర్తయయ్యాయి. గణపతిని వాహనంపైకి ఎక్కించారు. కాసేపట్లో గ్రామ ప్రదిక్షణ ప్రారంభం కానుంది. బాలాపూర్ లడ్డూ వేలంపాటలో ఈసారి కొత్తగా 9 మంది సభ్యులు పోటీలో నిలిచారు. ఇప్పటికే...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్