నేటి నుంచి గ్రూప్ -1 మెయిన్స్ పరీక్షలు

స్వతంత్ర వెబ్ డెస్క్: ఏపీలో ఇవాళ్టి నుంచి గ్రూప్ -1 మెయిన్స్ పరీక్షలు జరగనున్నాయి. మొత్తం పది జిల్లాల్లో 11 పరీక్షా కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. ఈ రోజు ప్రారంభం కానున్న ఈ పరీక్షలు ఈనెల 10 వ తేదీ వరకు నిర్వహించనున్నారు. అభ్యర్థులు గంట ముందే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని అధికారులు సూచించారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష జరగనుంది. 8 గంటల 30 నిమిషాల నుంచి 9 గంటల 30 నిమిషాల వరకు అభ్యర్థులను కేంద్రాల్లోకి అనుమతిస్తామని.. ఆ తరువాత తనిఖీ ప్రక్రియ చేపట్టనున్నట్లు తెలిపారు. పరీక్ష రాస్తోన్న 6,455 మందికి 70 బయెమెట్రిక్ యంత్రాలు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. బయోమెట్రిక్ తో పాటు తొలిసారి ఫేస్ రికగ్నైజేషన్ విధానాన్ని అమలు చేయనున్నారు. పరీక్షా కేంద్రాల్లోని సీసీ కెమెరాలను కమాండ్ కంట్రోల్ రూమ్ కు అనుసంధానించారు. పరీక్ష పేపర్ లీకేజీసహా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ట చర్యలు తీసుకున్నారు. అభ్యర్థులు మాల్ ప్రాక్టీస్​కు పాల్పడకుండా పటిష్ట చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.

గతంలో ట్యాబ్​లు ఇచ్చి ఆన్​లైన్ ద్వారా పరీక్ష జరపగా.. ఈ సారి దాన్ని తొలగించారు. కేవలం ఆఫ్​లైన్‌లో పరీక్ష నిర్వహించనున్నారు. గ్రూప్‌-1 ఉద్యోగాలకు మొత్తం 1,26,449 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. 2023 జనవరి 8న గ్రూప్ 1 పరీక్షలు జరుగగా అందులో 6,455 మంది మెయిన్స్​కు అర్హత సాధించారు. 290 మంది దివ్యాంగులు పరీక్ష రాయనున్నారని, అందుకు తగిన ఏర్పాట్లు చేశామని అధికారులు వివరించారు.

Latest Articles

కాసేపట్లో బాలాపూర్ లడ్డూ వేలం పాట

బాలాపూర్‌ గణనాథుడి నిమజ్జనానికి ఏర్పాట్లు పూర్తయయ్యాయి. గణపతిని వాహనంపైకి ఎక్కించారు. కాసేపట్లో గ్రామ ప్రదిక్షణ ప్రారంభం కానుంది. బాలాపూర్ లడ్డూ వేలంపాటలో ఈసారి కొత్తగా 9 మంది సభ్యులు పోటీలో నిలిచారు. ఇప్పటికే...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్