స్వతంత్ర వెబ్ డెస్క్: ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో ఇప్పటికే 240కి పైగా మృతి చెందినట్లు అధికారిక గణాంకాలు తెలుపుతున్నాయి. వెయ్యి మందికి పైగా గాయపడ్డారు. మృతులు, క్షతగాత్రులు పెరగనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ప్రమాదంలో మూడు రైళ్లు ఢీకొనడం తీవ్ర విస్మయాన్ని కలిగిస్తోంది. చాలా సందర్భాల్లో రైలు పట్టాలు తప్పడం, రెండు రైళ్లు ఢీకొనడం వంటి సంఘటనలు జరుగుతూనే ఉంటాయి. కానీ ఒకేసారి మూడు రైళ్లు ఢీకొనడం పట్ల పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది.
కొంకణ్ రైల్వే పరిధిలో 100 శాతం విద్యుదీకరణ పూర్తైందని రెండు నెలల క్రితం రైల్వే మంత్రిత్వ శాఖ ప్రకటించింది. అంతే కాకుండా రాష్ట్రంలో డంబ్లింగ్, ట్రంబ్లింగ్ పెద్ద ఎత్తున కొనసాగడమే కాకుండా సిగ్నలింగ్ వ్యవస్థ, సాంకేతికత చాలా పెరిగిందని స్వయంగా కేంద్రరైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. అంతలోనే ఇంత పెద్ద ప్రమాదం జరగడం శోచనీయం. విపక్షాల నుంచి సహజంగానే విమర్శలు వస్తున్నప్పటికీ మూడు రైళ్లు ఢీకొనడంపై ప్రజల నుంచి సైతం తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
పరిహారం
మృతుల కుటుంబాలకు రైల్వే శాఖ 10 లక్షల రూపాయలు ప్రకటించింది. తీవ్రంగా గాయపడిన వారికి 2 లక్షల రూపాయలు, స్వల్పంగా గాయపడిన వారికి 50,000 రూపాయల అందజేయనున్నట్లు తెలిపారు. అదనంగా, ప్రమాదంలో మరణించిన కుటుంబ సభ్యులకు పీఎంఎన్ఆర్ఎఫ్ నుంచి 2 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా ఇవ్వనున్నట్లు ప్రధానమంత్రి కార్యాలయం ప్రకటించింది. అలాగే గాయపడిన వారికి సైతం పీఎంఎన్ఆర్ఎఫ్ నుంచి 50,000 ఇవ్వనున్నారు.
హెల్ప్‌లైన్ నంబర్లు
ఈ ప్రమాదానికి సంబంధించి ఒడిశా ప్రభుత్వం హెల్ప్‌లైన్ నంబర్‌ను జారీ చేసింది. 06782-262286 అనే నంబరు ద్వారా హెల్ప్‌లైన్ తీసుకోవచ్చు. రైల్వే హెల్ప్‌లైన్‌లు 033-26382217 (హౌరా), 8972073925 (ఖరగ్‌పూర్), 8249591559 (బాలాసోర్) 044- 25330952 (చెన్నై). ఆంధప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసిన హెల్ప్‌లైన్ నంబర్లు విజయవాడ-0866 2576924, రాజమండ్రి – 08832420541, సామర్లకోట-7780741268, నెట్టూరు-08612342028, ఒంగోలు-7815909489, గూడూరు-08624250795, ఏలూరు-08812232267