ప్రధాని నరేంద్ర మోదీ విశాఖకు చేరుకున్నారు. కాసేపట్లో విశాఖ నేవీలోని ఐఎన్‌ఎస్ డేగకి మోదీ రానున్నారు. ప్రధాని మోదీకి గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి మోదీ భారీ రోడ్ షో ప్రారంభం కానుంది. ప్రధాని మోదీ టూర్ నేపధ్యంలో భారీ సెక్యూరిటీ ఏర్పాటు చేశారు.
మొత్తం రూ.2 లక్షల కోట్ల విలువైన అభివృద్ధి పనులకు మోదీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. రైల్వే జోన్, పారిశ్రామిక హబ్, గ్రీన్ హైడ్రోజన్ హబ్, బల్క్ డ్రగ్ పార్క్‌లకు శంకుస్థాపన చేయనున్నారు.అనంతరం ప్రధాని మోదీ బహిరంగ సభలో పాల్గొంటారు.