తమిళిసై రాజీనామాను ఆమోదించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

తెలంగాణ గవర్నర్ పదవికి తమిళిసై సోమవారం రాజీనామా చేశారు. తమిళిసై రాజీనామాను నేడు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు. ఈ క్రమంలోనే జార్ఖండ్‌ గవర్నర్‌ సీపీ రాధాకృష్ణన్‌కు తెలంగాణ గవర్నర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు. తెలంగాణతో పాటుగా పుదుచ్చేరి లెఫ్టినెంట్‌ గవర్నర్‌గానూ సీపీ రాధాకృష్ణన్‌కు అదనపు బాధ్యతలు ఇచ్చారు. సీపీ రాధాకృష్ణన్‌ కూడా తమిళనాడుకు చెందిన వారే. కోయంబత్తూరు నుండి రెండు సార్లు లోక్‌సభ ఎంపీగా ఎన్నికయ్యారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా పని చేశారు. 2023 ఫిబ్రవరిలో జార్ఖండ్‌ గవర్నర్‌గా ఎన్నికయ్యారు.

లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ నుంచి ఎంపీగా పోటీ చేస్తున్నందున గవర్నర్‌ పదవికి తమిళిసై రాజీనామా చేశారు. తమిళనాడులోని కన్యాకుమారి నుంచి గాని తిరునల్వేలి లేక చెన్నై సౌత్ లేదా పుదుచ్చేరి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా బరిలో దిగనున్నట్లు సమాచారం. ఇప్పటికే లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యింది.

Latest Articles

ప్రశ్న రావణ్‌ ఇక జైలులోనేనా?.. ఆయనపై ఆరోపణలు ఏంటి?.. చట్టం ఏం చెబుతోంది?

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో జోసెఫ్ అలియాస్ ప్రశ్న రావణ్‌ పేరు మారుమోగుతోంది. ఏపీ ఉప ముఖ్యమంత్రి ప‌వ‌న్ క‌ళ్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశార‌న్న కార‌ణంతో రావ‌ణ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో ఎవ‌రీ...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్