Prabhas Project K | యంగ్ రెబల్ స్టార్, ఇండియన్ స్టార్ హీరో ప్రభాస్ కొత్త చిత్రం ప్రాజెక్ట్ K గురించి ఓ వార్త ఫిల్మ్ నగర్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. నాగ్ ఆశ్విన్(Nag Ashwin) దర్శకత్వంలో వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్వనీదత్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం నైజాం(Nizam) ఏరియా రైట్స్ రూ.70 కోట్లకు అమ్ముడైనట్లు తెలుస్తోంది. కేవలం ఒక్క ఏరియా రైట్స్ కే ఇంత భారీ ధర పలకడం చూస్తుంటే ప్రభాస్ క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో అర్థం అవుతోంది. దీంతో ‘నైజాం కా బాప్’ ప్రభాస్ అంటూ డార్లింగ్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. బాహుబలి సిరీస్ తో ప్రపంచ వ్యాప్తంగా క్రేజ్ సంపాందిచుకున్న ప్రభాస్ గత రెండు సినిమాలు ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. అయినా కానీ Project K మూవీని హై రేంజ్ అమౌంట్ లో కొనడం ప్రభాస్ స్టామినాను తెలియజేస్తోంది. ప్రస్తుతం ప్రభాస్ ఆదిపురుష్, సలార్, రాజా డీలక్స్ చిత్రాలతో బిజీగా ఉన్నాడు.