Meghalaya BJP Chief | మేఘాలయలో ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఎర్నెస్ట్ మౌరీ సంచలన వ్యాఖ్యలు చేశారు. మేఘాలయ రాష్ట్రంలో మెజార్టీ ప్రజలు బీఫ్ తింటారని.. తాను కూడా తింటానని తెలిపారు. బీఫ్ తినడంపై రాష్ట్రంలో ఎలాంటి ఆంక్షలు లేవని.. ఇది తమ ఆహార అలవాటు అని వెల్లడించారు. రాష్ట్రంలో అందరూ తమకు కావాల్సింది తినే స్వేచ్ఛ ఉందని ఆయన పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాల్లో బీఫ్ తినడం నిషేధించండపై తానేమి వ్యాఖ్యానించనన్నారు. బీజేపీ క్రైస్తవ వ్యతిరేకపార్టీగా ప్రతిపక్షాలు చిత్రీకరిస్తున్నాయని మండిపడ్డారు. మేఘాలయలో ఎక్కువ శాతం మంది క్రిస్టియేన్లని.. ఈసారి అందరూ బీజేపీకి ఓటు వేసి గెలిపిస్తారని ఆయన ధీమా వ్యక్తంచేశారు.