ప్రభాస్, గోపీచంద్ తో… బాలకృష్ణ పంచ్ లు

అన్ స్టాపబుల్ అంటేనే అందరికీ గుర్తు వచ్చేది బాలకృష్ణ. ఆయన హోస్ట్ గా ఉండేసరికి ఆ ప్రోగ్రామ్ కే ఒక కలరింగ్ వచ్చింది. అంతేకాదు ఆయన కూడా తనదైన శైలిలో, తనదైన బాణీలో, తనదైన మార్కుతో ఆ కార్యక్రమం సూపర్ హిట్ అయ్యేందుకు శాయశక్తులా కృషి చేస్తున్నారు.

ఈ క్రమంలో ఇప్పటికి ఎంతో మంది ప్రముఖ రాజకీయ నాయకులు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో సహా వచ్చారు. అలాగే ప్రముఖ నిర్మాతలు అల్లు అరవింద్, సురేష్ బాబు వీరేకాదు, ప్రముఖ దర్శకులు రాఘవేంద్రరావు, రాజమౌళి, సుకుమార్, కోదండరామిరెడ్డి లాంటి వాళ్లు వచ్చారు. దిల్ రాజ్ అయితే అన్ స్టాపబుల్ పోస్టర్ నే లాంచ్ చేశారు.

ఇక హీరోల్లో మహేష్ బాబు, రవితేజ, నాని, బ్రహ్మానందం, అల్లు అర్జున్, ఇలా అందరూ కూడా బాలకృష్ణ పంచులకి నవ్వుతూనే సమాధానాలిచ్చి, ప్రేక్షకులకి మంచి వినోదాన్ని అందించారు. ఇంతకీ విషయం ఏమిటంటే…ఇప్పుడు పాన్ ఇండియా హీరో ప్రభాస్ వస్తున్నారు… బాలకృష్ణ ముందుకి…అయితే ఇందులో మరో ట్విస్ట్ ఏమిటంటే, ప్రభాస్ తో పాటు గోపీచంద్ కూడా పాల్గొన్నాడని మేకర్స్ ప్రకటించారు.

ఇక వీళ్లిద్దరితో బాలకృష్ణ ఎలా నడిపిస్తాడోనని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.అందుకు తగినట్టుగానే ఆయన కళ్లజోడు ఒకటి ఎగరేసి పట్టు కునే ఫొటో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. మరి ఇన్ని జిమ్మిక్కులతో ముందుకు వస్తున్న అన్ స్టాపబుల్ పై నెటిజన్లు ఎంతో ఆసక్తిగా ఉన్నారు.

Latest Articles

కొరియన్ కనకరాజు వచ్చేస్తున్నాడు..

మెగా హీరో వరుణ్ తేజ్ ఈమధ్య కాలంలో నటించిన సినిమాలు వరుసగా ఫ్లాప్ అయ్యాయి. సరైన బ్లాక్ బస్టర్ కోసం చూస్తున్న వరుణ్ ఈసారి రూటు మార్చి డిఫరెంట్ ఎంటర్ టైనర్ చేస్తున్నాడు....
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్