సీఎం జగన్‌ సమక్షంలో వైసీపీలో చేరిన పోతిన మహేష్‌

   పోతిన మహేశ్ వైసీపీలో చేరారు. పార్టీ అధినేత, సీఎం జగన్ సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. పోతిన మహేశ్‌కు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు జగన్‌. జనసేనలో విజయవాడ పశ్చిమ సీటు ఆశించి భంగపడ్డారు. రెండు రోజుల క్రితం జనసేన పార్టీకి రాజీనామా చేసిన పోతిన మహేశ్… అధికార వైసీపీలో చేరబోతున్నట్టు సంకేతాలు ఇచ్చారు. మాట ఇస్తే మడమ తిప్పని నాయకుడితో కలుస్తానని అన్నారు. దమ్మున్న నాయకుడితోనే ఉంటానని, సింహంలా సింగిల్‌గా వచ్చే నాయకుడి దగ్గరకు వెళ్తానని చెప్పారు.

ఈ క్రమంలో ఇవాళ సీఎం జగన్ సమక్షంలో పోతిన మహేశ్ వైసీపీలో చేరారు. విజయవాడ ఎంపీగా వైసీపీ తరఫున పోటీ చేస్తున్న కేశినేని నాని… పోతిన మహేశ్‌తో చర్చలు జరిపినట్లుగా తెలుస్తోంది. వాస్తవా నికి అయితే ఇండిపెండెంట్ గా పోటీ చేయాలని మహేష్ భావించారు. అయితే ఆయనతో కేశినేని నాని చర్చలు జరపడంతో వైసీపీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. తాజా పరిణామం విజయవాడ పరిధిలో వైసీపీ బలాన్ని పెంచేదిగా ఉందని పార్టీ వర్గాలు అంటున్నాయి.

Latest Articles

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్