నల్లపూసల బాబ్జీ దర్శకత్వంలో ‘పోలీసువారి హెచ్చరిక’

‘నల్లపూసలు’ ఫేం బాబ్జీ దర్శకత్వంలో తూలికా తనిష్క్ క్రియేషన్స్ పతాకంపై బెల్లి జనార్థన్ తొలి ప్రయత్నంగా నిర్మిస్తున్న చిత్రం ‘పోలీసువారి హెచ్చరిక’.ఈ చిత్రం శరవేగంగా టాకీ పార్ట్‌ను పూర్తి చేసుకొని ప్రస్తుతం పాటల చిత్రీకరణను జరుపుకుంటోంది. ఈ సందర్భంగా దర్శకుడు బాబ్జీ మాట్లాడుతూ.. అరకులోయ, కాఫీ వనం, ఆపిల్ రిసార్ట్స్, వైజాగ్ యారాడా బీచ్, నకిరేకల్ లాండ్స్, యస్ స్టూడియో మొదలైన లొకేషన్స్‌లో పాటలను చిత్రీకరిస్తున్నామని తెలిపారు. రెండు దశాబ్దాలుగా తెలుగు రాష్ట్రాల్లోని గాయనీ గాయకులతో ఐదు లక్షల ప్రైవేట్ సాంగ్స్‌ను స్వరపరచి సంచలనం సృష్టించిన సంగీత దర్శకుడు ‘గజ్వేల్ వేణు’ను ఈ సినిమా ద్వారా వెండితెరకు పరిచయం చేస్తున్నామని దర్శకుడు బాబ్జీ వెల్లడించారు.

చిత్ర నిర్మాత బెల్లి జనార్థన్ మాట్లాడుతూ రెండు రోజుల్లో పాటల చిత్రీకరణ పూర్తవుతుందని, ఆ తర్వాత నల్గొండలో క్లైమాక్స్ సన్నివేశాలను చిత్రీకరించడంతో సినిమా షూటింగ్ పూర్తవుతుందని తెలిపారు.

నటీనటులు: అఖిల్ సన్నీ, అజయ్ ఘోష్, రవి కాలే, సాయాజీ షిండే, శుభలేఖ సుధాకర్, కాశీ విశ్వనాథ్, సంజయ్ నాయర్, జబర్దస్త్ వినోద్, జబర్దస్త్ పవన్, హిమజ, జయ వాహిని, శంకరాభరణం తులసి, మేఘనా ఖుషి, రుచిత తదితరులు

సాంకేతిక నిపుణులు:
కెమెరా : నళినీ కాంత్ , సంగీతం : గజ్వేల్ వేణు,
ఎడిటర్ : శివ శర్వాణి,
పీఆర్వో: మధు వీఆర్,
ప్రాజెక్ట్ కో ఆర్డినేటర్ : హను మంతరావు,
నిర్మాణ నిర్వహణ : ఎన్. వై. సుబ్బరాయుడు,
నిర్మాత : బెల్లి జనార్థన్,
రచన , దర్శకత్వం : బాబ్జీ

Latest Articles

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్