25.7 C
Hyderabad
Sunday, May 19, 2024
spot_img

ఏపీలో రాళ్ల రాజకీయం

జగన్మోహన్ రెడ్డిపై రాళ్ల దాడి సంఘటనను ప్రజలు ఇంకా మరువకముందే, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సభలో రాయి కలకలం రేపింది. గాజువాకలో చంద్రబాబు నిర్వహించిన ప్రజాగళం సభలో రాయి వచ్చి పడింది. చంద్రబాబు సభలో మాట్లాడుతుండగా దుండగుడు రాయి విసిరాడు. రాయి విసిరిన శబ్దం వినపడటంతో అక్కడున్న భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. అయితే దుండ గుడు విసిరిన రాయి చంద్రబాబు దగ్గరకు రాకపోవడంతో ఎటువంటి ప్రమాదం చోటు చేసుకోలేదు. రాయి సమీప బారికేడ్లను తాకి పడిపోయిందని తెలుగుదేశం పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.

రాయి వచ్చిన దిశగా పోలీసులు పరుగులు తీశారు. ఆ ప్రాంతాన్ని జల్లెడ పట్టారు. దాదాపు అరగంట పాటు పోలీసులు గాలించారు. కాగా చంద్రబాబు ప్రజాగళం సభ ప్రారంభానికి ముందే పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను గాజువాక పోలీసులు బైండోవర్ చేశారు. వారెవరైనా రాయి విసిరిన సంఘటనకు పాల్పడ్డారా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. ఇదిలా ఉంటే న్యూపోర్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉండే ఒక యువకుడిని పోలీసులు స్టేషన్‌కు పిలిపించి విచారించారు. కాగా చంద్రబాబు సభలో రాయి కలకలం రేపిన సంఘటనపై పోలీసులు ఆరా తీస్తున్నారు. గాజువాక సభలో రాయి కలకలం సంఘటనపై చంద్రబాబు స్పందించారు. బాంబులకే భయపడలేదు…రాళ్లకు భయపడతానా ? అని ప్రశ్నించారు చంద్రబాబు. విమానాశ్రయంలో ఉండగా జగన్మోహన్ రెడ్డిపై రాళ్లదాడి సంఘటన గురించి తెలిసిందన్నారు. వెంటనే తాను ఆ సంఘటనను ఖండించానన్నారు. అయితే అరగంటలోపే తానే జగన్మోహన్ రెడ్డిపై రాళ్లు వేయించానని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ నాయకలు ప్రచారం చేశారని మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డిపై ఎవరో గులకరాయి వేస్తే, అందుకు తనను బాధ్యుడిని చేయడం దారుణమన్నారు చంద్రబాబు.ఇదిలా ఉంటే జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రచార యాత్రలోనూ రాయి సంఘటన జరిగింది. తెనాలి పట్టణంలో పవన్ కల్యాణ్ ప్రచార యాత్రలో ఉండగా ఓ ఆగంతకుడు రాయి విసిరి నట్లు కలకలం రేగింది. రోడ్ షోలో భాగంగా చెంచుపేట వద్దకు చేరుకోగానే, ఒక యువకుడి ప్రవర్తన అనుమానాస్పదంగా అనిపించింది.

   రాయి సంఘటన హల్‌చల్ కావడంతో స్థానికులు, పవన్ కల్యాణ్ అభిమానులు అప్రమత్తమయ్యారు. రాయి విసిరిన యువకుడిని గుర్తించి పోలీసులకు అప్పగించారు. దీంతో అందరూ ఊపిరి పీల్చు కున్నారు. అనుమానాస్పదంగా ప్రవర్తించిన యువకుడిని పోలీసులు సమీపాన గల ఒక కల్యాణ మండ పానికి తీసుకెళ్లి విచారించి పంపేశారు. దర్యాప్తు కొనసాగే సమయంలో అవసరమైతే పిలిపిస్తామని యువ కుడితో పోలీసులు చెప్పారు. మరికొన్ని రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో అటు లోక్‌సభ ఇటు శాసనసభ ఎన్నికలు జరగబోతున్నాయి. ఎన్నికలకు గడువు నెల కూడా లేదు. ఎన్నికలు తరుముకువస్తున్న ఈ తరుణంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు గరంగరంగా సాగుతున్నాయి. ఒకవైపు ముఖ్యమంత్రి పై మరోవైపు ప్రతిపక్ష నాయకులపై రాళ్ల దాడులు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను కుదిపివేస్తున్నాయి.ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రి జగన్మోహన్ రెడ్డిపై రాళ్లదాడి జాతీయ రాజకీయాల్లోనూ చర్చకు దారితీసింది. జగన్మోహన్ రెడ్డిపై రాళ్లదాడి మరో కోడికత్తి డ్రామా అంటూ ప్రతిపక్షాలు ఎద్దేవా చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో అటు తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రజాగళం సభలోనూ అలాగే జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ నిర్వహిం చిన ప్రచారయాత్రలోనూ ఆగంతకులు రాళ్లు విసరడం కలకలం రేపాయి. దీంతో ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల ప్రచారం కొత్త టర్న్ తీసుకుందా ? అనే చర్చ మొదలైంది.

Latest Articles

కళ్యాణ దుర్గంలో గెలిచేది ఎవరు?

ఎన్నికలు పూర్తయ్యాయి. ఓటర్ల తీర్పు ఈవిఎంల్లో నిక్షిప్తమై ఉంది. ఎవరు విజేతలో, ఎవరు పరాజితులో తెలియా లంటే జూన్ 4 వ తేదీ వరకు ఆగాల్సి ఉంది. అయితే, కళ్యాణ దుర్గం నియోజకవర్గంలో...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్