చాహత్ బ్యానర్‌పై కమలేష్ కుమార్ నిర్మాణ సారధ్యంలో తెరకెక్కుతున్న చిత్రం ‘సిల్క్ శారీ’. వెబ్ సిరీస్‌ల్లో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకొన్న వాసుదేవ్ రావు హీరోగా, రీవా చౌదరి, ప్రీతీ గోస్వామి హీరోయిన్స్‌గా టి. నాగేందర్ స్వీయ దర్శకత్వంలో రొమాంటిక్ లవ్ స్టోరీగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి చేతుల మీదుగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు.
ఈ సందర్భంగా రాజ్ కందుకూరి మాట్లాడుతూ ‘‘సినిమా టైటిల్ ‘సిల్క్ శారీ’ అద్భుతంగా ఉంది. డైరెక్టర్ నుండి ఆశించిన అద్భుతమైన పనితనం కనిపించింది. టీజర్, ఫస్ట్ లుక్ చాలా బాగున్నాయి. ప్రొడ్యూసర్, డైరెక్టర్‌కు పేరుతో పాటు డబ్బులు కూడా రావాలని ఆశిస్తున్నా.’’ అని అన్నారు.
హీరో వాసుదేవ్ రావు మాట్లాడుతూ ‘‘మా డైరెక్టర్ నాగేందర్ ఒక మంచి సబ్జెక్టుతో ఈ సినిమాని రూపొందించారు. నిర్మాత ఎక్కడా ఖర్చుకు వెనకాడకుండా మంచి చిత్రాన్ని నిర్మించారు. టైటిల్ లుక్ రిలీజ్ చేసినందుకు రాజ్ కందుకూరి గారికి థాంక్స్’’ అని చెప్పారు.
బలమైన కథ, దానికి తగ్గట్టుగానే డ్రామా సన్నివేశాలను అద్భుతంగా రాసుకొని, ఓ ఆసక్తికరమైన సంఘటన చుట్టూ ‘సిల్క్ శారీ’ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ చిత్రం కచ్చితంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని మేకర్స్ నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.
నటీనటులు: వాసుదేవ్ రావు , రీవా చౌదరి , ప్రీతీ గోస్వామి , ఓంకార్ నాథ్ శ్రీశైలం , కోటేష్ మానవ తదితరులు.
డైరెక్టర్ :టి . నాగేందర్
నిర్మాతలు : కమలేష్ కుమార్ , రాహుల్ అగర్వాల్ హరీష్ చండక్
బ్యానర్: చాహత్ ప్రొడక్షన్స్
సంగీత దర్శకుడు: వరికుప్పల యాదగిరి
కెమెరా : సనక రాజశేఖర్
పీఆర్ఓ: శ్రీపాల్ చొల్లేటి