ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించడంలో భాగంగా వరంగల్ పోలీసులు కవాతు నిర్వహించారు. పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు నిర్భయంగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని స్థానిక ఏసీపీ నందిరామ్ నాయక్ పిలుపునిచ్చారు. అర్బన్ ప్రజల ఓట్ల శాతం పెంచడంతో పాటు ఎన్నికల వేళ శాంతి భద్రతలపై ప్రజలకు నమ్మకం కలిగించేందుకే ఈ కవాతు నిర్వహించడం జరిగిందన్నారు. వరంగల్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఆదేశాలతో మిల్స్ కాలనీ స్టేషన్ సీఐ మల్లయ్య ఆధ్వర్యంలో కవాతు చేపట్టామన్నారు. ఈ కవాతు అండర్ బ్రిడ్జి నుండి బూడిది గడ్డ మీదుగా పోర్ట్ రోడ్డు జంక్షన్ నుండి ఖిలా వరంగల్ వరకు జరిగిందన్నారు.
లోక్ సభ ఎన్నికల వేళ వరంగల్‌లో పోలీసులు కవాతు
0
451
Previous article
Next article
Latest Articles
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో పెరుగుతున్న సీనియర్ల అసంతృప్తి
తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి సొంత నేతల నుంచే తీవ్ర స్థాయి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఒకవైపు ప్రతిపక్షాల విమర్శలను దీటుగా ఎదుర్కొంటున్న ప్రభుత్వానికి, అంతర్గతంగా సీనియర్ నాయకుల అసంతృప్తి వ్యవహారం పెద్ద...
- Advertisement -
- Advertisement -


