తిరుపతిలో ఆకతాయిలకు పోలీసులు చెక్‌పెట్టారు. శబ్థ కాలుష్యాన్ని కలిగించే 350 ద్విచక్రవాహనాలోని సైలెన్సర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రోడ్ రోలర్స్ తో సైలెన్సర్లను తొక్కించి ధ్వంసం చేశారు. ప్రజలను ఇబ్బందులకు గురిచేసేలా కొంతమంది యువకులు ద్విచక్రవాహనాలకు పెద్ద పెద్ద శబ్థాలు వచ్చే సైలెన్సర్లను అమర్చుకున్నారని తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు చెప్పారు. యువకులకు కౌన్సిలింగ్ ఇచ్చామని.. శబ్థ కాలుష్యాన్ని కలిగించే సైలెన్సర్లతో ఎక్కువసార్లు యువకులు పట్టుబడితే కేసులు పెడతామని హెచ్చరించారు. సైలెన్సర్లను బిగించే మెకానిక్ ల పైనా కేసులు నమోదు చేస్తామన్నారు.