మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మృతికి సంతాపంగా..ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు వినూత్నంగా నివాళులర్పించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉపాధ్యాయుడు నరేష్ సుద్ధముక్కపై మన్మోహన్ సింగ్ ప్రతిమను చెక్కి నివాళులర్పించారు. దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టిన వ్యక్తి మన్మోహన్ సింగ్ అని కొనియాడారు. నాలుగున్నర గంటల పాటు శ్రమించి సుద్ద ముక్కపై మన్మోహన్ సింగ్ ప్రతిమ చెక్కినట్లు నరేష్ తెలిపారు.