12 గంటలకు చంద్రబాబుతో పవన్‌ కల్యాణ్, బాలకృష్ణ, లోకేష్‌ ములాఖత్‌

స్వతంత్ర వెబ్ డెస్క్: స్కిల్ డవలప్‌మెంట్ స్కామ్ కేసులో అరెస్టై రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడును (Chandrababu) జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ (Pawan kalyan) నేడు కలువనున్నారు. ఆయనతోపాటు ఎమ్మెల్యే బాలకృష్ణ, మాజీ మంత్రి నారా లోకేష్‌ కూడా మూలాఖత్‌ కానున్నారు. గురువారం మధ్యాహ్నం 12 గంటలకు ఆయనతో భేటీ కానున్నారు. సుమారు 40 నిమిషాలపాటు జైలు అధికారులు సమయం ఇచ్చినట్లు తెలుస్తున్నది. ఈ నేపథ్యంలో ఉదయం 10 గంటలకు పవన్‌, బాలకృష్ణ రాజమండ్రి జైలుకు చేరుకోనున్నారు. భేటీ అనంతరం పవన్‌ హైదరాబాద్‌ రానున్నారు. దీంతో జైలు వద్ద పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు.

కాగా, చంద్రబాబు అరెస్టయినప్పుడే ఆయనను కలిసేందుకు పవన్‌ కల్యాణ్‌ ప్రయత్నించారు. అయితే పోలీసులు దానికి ఒప్పుకోలేదు. దీంతో నడిరోడ్డుపై పడుకుని జనసేనాని నానా హంగామా చేసిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ములాఖత్‌ అనుమతి లభించింది. అనంతరం మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది. ఇప్పటికే టీడీపీ, జనసేన మధ్య బంధం బలపడిన విషయం తెలిసిందే. బాబు అరెస్టు అనంతరం ఆ పార్టీ ఇచ్చిన బంద్‌కు పవన్‌ మద్దతు తెలిపారు. జనసేనానిని చంద్రబాబు దత్తపుత్రుడంటూ అధికార వైసీపీ తరచూ విమర్షిస్తూ వస్తున్నది.

Latest Articles

జనసేన ఓట్ల వ్యూహానికి సీఎం రేవంత్ రెడ్డి మాస్టర్ స్ట్రోక్

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్దీ తెలంగాణ రాజకీయ ముఖచిత్రం వేగంగా మారుతోంది. ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల వ్యూహాలకు పదును పెడుతుండగా.. బీజేపీ, జనసేన మధ్య జరుగుతున్న పొత్తుల...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్