స్వతంత్ర వెబ్ డెస్క్: దేశంలో నిపా వైరస్ కలకలం సృష్టిస్తోంది. కేరళలో నాలుగు నిపా కేసులు నమోదు అయ్యాయి. దీంతో కేరళలో వైరస్ అలర్ట్ ప్రకటించారు. ఈ నిపా వైరస్ తో కోజికోడ్ జిల్లాలో ఇద్దరు ఈ వైరస్ వల్ల చనిపోయారని రాష్ట్ర ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ తెలిపారు. ఈ నెల ప్రారంభంలో ఒక మరణం సంభవించగా, మరొకటి ఆగస్టు 30న కోజికోడ్ జిల్లాలో సంభవించింది. మృతుల బంధువులకు ఇద్దరికి పాజిటివ్ పరీక్ష చేయగా వారికి పాజిటివ్ వచ్చింది. 2018లో కేరళ మొదటిసారిగా నిపా వైరస్ ను గుర్తించారు. ఈ వ్యాధి సోకిన సోకిన 23 మందిలో ఇరవై ఒక్కరు మరణించారు.
2019, 2021లో నిపాతో మరో ఇద్దరు ప్రాణాలను కోల్పోయారు. వైరస్ సోకిన గబ్బిలాలు, పందులు లేదా ఇతర వ్యక్తుల శరీర ద్రవాలతో ప్రత్యక్ష సంబంధం ద్వారా మానవులకు ఈ వైరస్ వ్యాపిస్తుంది. ఇది మొట్టమొదట 1999లో మలేషియా, సింగపూర్‌లో పందుల పెంపకందారులు, పందులతో సన్నిహితంగా ఉన్నవారి ఈ వ్యాధి వచ్చింది. పరిస్థితిని సమీక్షించడానికి, వైరస్ వ్యాప్తి చెందకుండా రాష్ట్ర ప్రభుత్వానికి సహాయం చేయడానికి నిపుణుల బృందాన్ని జిల్లాకు తరలించారు. “నేను కేరళ ఆరోగ్య మంత్రితో మాట్లాడాను, ఈ సీజన్‌లో ఈ వైరస్ గురించి చాలాసార్లు నివేదికలు వచ్చాయి. కేసులు వస్తున్నాయి. ఈ వైరస్ గబ్బిలాల ద్వారా వ్యాపిస్తుంది. దీనికి సంబంధించి ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఒక మార్గదర్శకాన్ని సిద్ధం చేసింది. జాగ్రత్తలు తీసుకోండి” అని కేంద్ర ఆరోగ్య మంత్రి మన్‌సుఖ్ మాండవియా తెలిపారు.
కోజికోడ్‌లోని ఏడు ప్రాంతాలను కంటైన్‌మెంట్ జోన్‌లుగా ప్రకటించారు. ఈ ఏడు చోట్ల 43 వార్డులకు ప్రవేశ, నిష్క్రమణలను పరిమితం చేశారు. వీటిలో అయంచేరి, మారుతోంకర, తిరువళ్లూరు, కుట్టియాడి, కాయక్కోడి, విల్యాపల్లి, కవిలుంపర ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో అవసరమైన సేవలు మాత్రమే అనుమతిస్తారు. దుకాణాలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పని చేస్తాయి. మెడికల్ షాపులు, ఆరోగ్య కేంద్రాలు, ఆసుపత్రులు తెరిచి ఉంటాయి. కార్యాలయాలు తక్కువ మంది పని చేయాల్సి ఉంటుంది. బ్యాంకులు, పాఠశాలలు, అంగన్‌వాడీలు మూసివేశారు.