స్వతంత్ర డిజిటల్: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవి హైదరాబాద్ లోని స్వతంత్ర టీవీ న్యూస్ ఛానెల్ కార్యాలయాన్ని సందర్శించారు. స్వతంత్ర ఛానెల్ మేనేజింగ్ డైరక్టర్ బి క్రిష్ణ ప్రసాద్ ఆయనకు ఆత్మీయ స్వాగతం పలికారు. ఛానెల్ లోని వివిధ విభాగాల్ని మల్లు రవికి పరిచయం చేశారు. వర్చువల్ స్టూడియోలు, డిజిటలైజ్డ్ బ్రాడ్ కాస్టింగ్ వ్యవస్థలతో అత్యున్నత టెక్నాలజీని ఉపయోగిస్తూ ఛానెల్ నిర్వహిస్తున్న తీరుని వివరించారు. టాటా స్కై వంటి డీటీహెచ్ ప్లాట్ ఫామ్ లతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లోని అన్ని కేబుల్ నెట్ వర్క్ లలో ఛానెల్ ప్రసారాలు లభ్యం అవుతున్నాయని తెలియ చేశారు. ఏడాదిన్నర కాలంలో మైలు రాళ్లు గా నిలిచిపోయిన తెలంగాణ నాడి, స్వతంత్ర స్ఫూర్తి, కన్నడ తీర్పు వంటి కార్యక్రమాల విశేషాల్ని మల్లు రవి తిలకించారు. రానున్న కాలంలో స్వతంత్ర టీవీ మరిన్ని విజయాల్ని సొంతం చేసుకోవాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా మల్లు రవిని స్వతంత్ర టీమ్ తరపున మేనేజింగ్ డైరక్టర్ క్రిష్ణ ప్రసాద్ ఆత్మీయంగా సత్కరించారు.