స్వతంత్ర వెబ్ డెస్క్: అసెంబ్లీ ఎన్నికలు దగ్గరకొస్తున్న తరుణంలో తీరిక లేకుండా రాష్ట్రం మెుత్తం సుడిగాలి పర్యటనలు చేస్తున్న మంత్రి కేటీఆర్….తన కుమారుడిని గుర్తుచేసుకుంటూ ట్విట్టర్‌లో చేసిన పోస్టుపై పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన కుమారుడిని మిస్సవుతున్నానంటూ కేటీఆర్ ఎక్స్‌వేదికగా ట్వీట్ చేశారు. దీనికి సమాధానంగా… దూరంగా ఉన్న బిడ్డ గుర్తొచ్చి గుండె బరువెక్కుతోందా కేటీఆర్…! అంటూ రేవంత్ రీ ట్వీట్ చేశారు. కొడుకుతో కొద్ది రోజల ఎడబాటుకే ప్రాణం తల్లడిల్లిపోతోందా….. అంటూ మండిపడ్డారు. ఉద్యోగం కోసం ఏళ్ల తరబడి ఇంటి మొహం చూడని, లక్షలాది మంది నిరుద్యోగుల తల్లిదండ్రుల ఆవేదన మీలా కాదనుకున్నావా…అని ప్రశ్నించారు. సర్కారు హాస్టళ్లలో పెట్టే తిండి తినలేక పిల్లలు ఏడుస్తున్నారని తెలిసి….. తల్లిదండులు పడే ఆవేదన మీలా కాదనుకుంటున్నావా….అని ఎద్దేవా చేశారు. మీ గ్లోబరీనా కంపెనీ ఉసురు తీసిన 30 మంది విద్యార్థుల కన్నపేగుల ఆక్రందన మీలా కాదనుకుంటున్నావా….అని మండిపడ్డారు. కుమారుడు తిరిగిరాని లోకాలకు వెళ్లి… పదేళ్లయినా… ఏ సాయానికి నోచుకోకుండా ఏడుస్తున్న అమరవీరుల కుటుంబాల యాతన మీలా కాదనుకున్నారా……..! అని నిలదీశారు.
నీ కొడుకు గురించి సరే.. మిగతా బిడ్డల సంగతేంటి.. కేటీఆర్ ట్వీట్‌పై రేవంత్ ఫైర్..
0
513
Previous article
Latest Articles
హిట్లర్‌ను బీజేపీ అనుసరిస్తోంది-అఖిలేష్
ఢిల్లీలో నిరసన తెలుపుతున్న విద్యార్థులు, రాజకీయ నాయకులపై పోలీసులు వ్యవహరించిన తీరును సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ తీవ్రంగా ఖండించారు. నిరసనలను అణచివేయడంలో, మహిళలను వేధించడంలో పాలకులు హిట్లర్‌ను అనుసరిస్తున్నారని...
- Advertisement -
- Advertisement -


